తెలుగు న్యూస్ / ఫోటో /
ఏటీఎం, ఈ-వాలెట్‌లో పీఎఫ్ డబ్బులు పొందొచ్చా? చర్చలు జరుపుతున్న ప్రభుత్వం!
- PF Withdraw In ATM Update : ఈపీఎఫ్ 3.0 ప్లాన్ ప్రకారం పీఎఫ్ డబ్బును ఇప్పుడు ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు పీఎఫ్ మొత్తాన్ని ఖాతాదారుడు ఈ-వాలెట్‌లో పొందవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఆర్బీఐ, వివిధ బ్యాంకులతో కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది.
- PF Withdraw In ATM Update : ఈపీఎఫ్ 3.0 ప్లాన్ ప్రకారం పీఎఫ్ డబ్బును ఇప్పుడు ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు పీఎఫ్ మొత్తాన్ని ఖాతాదారుడు ఈ-వాలెట్‌లో పొందవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఆర్బీఐ, వివిధ బ్యాంకులతో కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది.
(1 / 5)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కస్టమర్లకు కొత్త సేవలను ప్రారంభించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకులతో చర్చలు ప్రారంభించింది. ఓ ప్రభుత్వ అధికారి హిందుస్థాన్ టైమ్స్‌తో ఈ విషయం గురించి మాట్లాడారు. బ్యాంకు ఖాతాలకు అనుసంధానమైన ఏటీఎంలు, ఈ-వ్యాలెట్ల ద్వారా పొదుపు డిపాజిట్లను నేరుగా పొందే అంశంపై చర్చిస్తున్నట్టుగా తెలిపారు.
(2 / 5)
క్లెయిమ్స్, పెన్షన్ల పరిష్కారం, వేగవంతమైన సేవల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన ఐటీ నెట్వర్క్‌ను పునరుద్ధరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రావిడెంట్ ఫండ్ తరహాలోనే 2025 జనవరిలో బ్యాంకు నుంచి నగదు ఉపసంహరణను ప్రారంభించవచ్చని పేర్కొంది.
(3 / 5)
ప్రస్తుతం పీఎఫ్ ఖాతాదారుల క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ డబ్బులు నేరుగా ఖాతాలోకి చేరుతున్నాయి. అయితే ఈ ప్రక్రియను సులభతరం చేయాలని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. పీఎఫ్ డబ్బులన్నీ ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోలేమని అంటున్నారు. గరిష్టంగా 50 శాతం పరిమితిని నిర్ణయించనున్నారు. ఉద్యోగులు ఈ వ్యాలెట్ల ద్వారా పీఎఫ్ డబ్బులు పొందవచ్చని కూడా కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
(4 / 5)
ప్రావిడెంట్ ఫండ్ ఈ-వ్యాలెట్ ను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం వివిధ బ్యాంకులతో చర్చించింది. బ్యాంకింగ్ వ్యవస్థ తరహాలో అత్యాధునిక ఈపీఎఫ్ఓ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా డిసెంబర్ 13న చెప్పారు.
(5 / 5)
సెంట్రలైజ్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్, ఎండ్-టు-ఎండ్ ఆటోమేటెడ్ ప్రాసెసింగ్, సెంట్రలైజ్డ్ మంత్లీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఆధారిత అకౌంటింగ్, రీస్ట్రక్చర్డ్ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్-రసీదు (ఈసీఆర్) తగిన స్టేట్మెంట్లతో కూడిన రసీదు, రెమిటెన్స్ చలాన్లు ఈపీఎఫ్ 3.0 పథకం కింద అమలు చేస్తున్న సంస్కరణలు.
ఇతర గ్యాలరీలు