Wrestlers protest live updates : రెజ్లర్లను కలిసిన ప్రియాంక గాంధీ- బీజేపీపై విమర్శలు-priyanka meets protesting wrestlers at jantar mantar accuses govt of protecting wfi chief brij bhushan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Priyanka Meets Protesting Wrestlers At Jantar Mantar, Accuses Govt Of 'Protecting' Wfi Chief Brij Bhushan

Wrestlers protest live updates : రెజ్లర్లను కలిసిన ప్రియాంక గాంధీ- బీజేపీపై విమర్శలు

Apr 29, 2023, 11:50 AM IST Sharath Chitturi
Apr 29, 2023, 11:50 AM , IST

  • Wrestlers protest live updates : డబ్ల్యూఎఫ్​ఐ చీఫ్​, బీజేపీ ఎంపీ బ్రిజ్​ భూషణ్​కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్​ మంతర్​ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లను శనివారం ఉదయం కలిశారు కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ. రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

శనివారం ఉదయం జంతర్​ మంతర్​ వద్దకు వెళ్లారు ప్రియాంక గాంధీ. మహిళా రెజ్లర్లతో కొంతసేపు మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయాన్ని.. రెజ్లర్లు ప్రియాంకకు చెప్పినట్టు తెలుస్తోంది.

(1 / 6)

శనివారం ఉదయం జంతర్​ మంతర్​ వద్దకు వెళ్లారు ప్రియాంక గాంధీ. మహిళా రెజ్లర్లతో కొంతసేపు మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయాన్ని.. రెజ్లర్లు ప్రియాంకకు చెప్పినట్టు తెలుస్తోంది.(Congress)

రెజ్లర్లకు పూర్తి మద్దతు తెలుపుతూ.. బ్రిజ్​ భూషణ్​ను ఆ పదవిలో నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. పదవిలో ఉన్నంత కాలం క్రీడాకారుల కెరీర్​ను ఆయన నాశనం చేసే విధంగా ఒత్తిడి చేస్తారని ఆరోపించారు.

(2 / 6)

రెజ్లర్లకు పూర్తి మద్దతు తెలుపుతూ.. బ్రిజ్​ భూషణ్​ను ఆ పదవిలో నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. పదవిలో ఉన్నంత కాలం క్రీడాకారుల కెరీర్​ను ఆయన నాశనం చేసే విధంగా ఒత్తిడి చేస్తారని ఆరోపించారు.(Congress)

ఈ క్రమంలోనే బీజేపీపైనా తీవ్ర ఆరోపణలు చేశారు ప్రియాంక గాంధీ. బ్రిజ్​ భూషణ్​ను బీజేపీ కాపాడుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వం రక్షించాల్సింది భూషణ్​ను కాదని.. దేశానికి ఎన్నో పతకాలు తీసుకొచ్చి రెజ్లర్లనని అన్నారు.

(3 / 6)

ఈ క్రమంలోనే బీజేపీపైనా తీవ్ర ఆరోపణలు చేశారు ప్రియాంక గాంధీ. బ్రిజ్​ భూషణ్​ను బీజేపీ కాపాడుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వం రక్షించాల్సింది భూషణ్​ను కాదని.. దేశానికి ఎన్నో పతకాలు తీసుకొచ్చి రెజ్లర్లనని అన్నారు.(ANI)

జంతర్​ మంతర్​ వద్ద మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మహిళలకు ఏదైనా అయితే.. ప్రభుత్వం వెంటనే మౌనంగా ఉండిపోతుందని అన్నారు.

(4 / 6)

జంతర్​ మంతర్​ వద్ద మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మహిళలకు ఏదైనా అయితే.. ప్రభుత్వం వెంటనే మౌనంగా ఉండిపోతుందని అన్నారు.

ప్రియాంక గాంధీ నిష్క్రమించిన అనంతరం రెజ్లర్లు ఢిల్లీలోని కన్నౌట్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. గురువారం బ్రిజ్​ భూషణ్​పై దాఖలు చేసిన ఎఫ్​ఐఆర్​ కాపీని పోలీసులు రెజ్లర్లకు ఇచ్చారు.

(5 / 6)

ప్రియాంక గాంధీ నిష్క్రమించిన అనంతరం రెజ్లర్లు ఢిల్లీలోని కన్నౌట్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. గురువారం బ్రిజ్​ భూషణ్​పై దాఖలు చేసిన ఎఫ్​ఐఆర్​ కాపీని పోలీసులు రెజ్లర్లకు ఇచ్చారు.(ANI)

మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్​ భూషణ్​ ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, పదవికి రాజీనామా చేయనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్​, ఇతర పార్టీలు కలిసి తనపై కుట్ర పన్నుతున్నట్టు ఆరోపించారు.

(6 / 6)

మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్​ భూషణ్​ ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, పదవికి రాజీనామా చేయనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్​, ఇతర పార్టీలు కలిసి తనపై కుట్ర పన్నుతున్నట్టు ఆరోపించారు.(PTI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు