Priyanka Chopra: తెలుగు హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా తమ్ముడు.. నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాలు ఇవే!-priyanka chopra brother siddharth chopra wedding with telugu heroine neelam upadhyaya priyanka chopra nick jonas photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Priyanka Chopra: తెలుగు హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా తమ్ముడు.. నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాలు ఇవే!

Priyanka Chopra: తెలుగు హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా తమ్ముడు.. నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాలు ఇవే!

Published Feb 09, 2025 12:21 PM IST Sanjiv Kumar
Published Feb 09, 2025 12:21 PM IST

  • Priyanka Chopra Brother Siddharth Chopra Wedding With Neelam Upadhyaya: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటివాడు అయ్యాడు. ప్రియాంక కన్నా ఏడేళ్లు చోన్నోడైన సిద్ధార్థ్ చోప్రా తెలుగు సినిమాలో హీరోయిన్‌గా చేసిన నీలమ్ ఉపాధ్యాయను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్దార్థ్ చోప్రా పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహమహోత్సవానికి అమెరికా నుంచి భార్యాభర్తలు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వచ్చి సందడి చేశారు. 

(1 / 8)

(All Pics @Instagram/Priyanka Chopra)

నూతన వధూవరులు సిద్ధార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయతో కలిసి ఇలా స్పెషల్‌గా ఫొటోలకు పోజు ఇచ్చింది ప్రియాంక చోప్రా. ఇందులో తన భర్త నిక్ జోనాస్‌ కూడా ఉన్నాడు. 

(2 / 8)

ఈ పెళ్లి వేడుకల్లో భర్త నిక్ జోనాస్ తల్లిదండ్రులు అంటే, అత్తమామలతో ప్రియాంక చోప్రా ఫొటోలు దిగింది. అత్తగారి కుటుంబంతో కలిసి ప్రియాంక చోప్రా ఇలా పోజులిచ్చింది. 

(3 / 8)

అనంతరం ప్రైవేట్‌గా భర్త నిక్ జోనాస్‌తో రొమాంటిక్‌గా ఫొటోలకు పోజులిచ్చింది ప్రియాంక చోప్రా. భర్త గుండెలపై చేయి వేసి స్టిల్ ఇచ్చింది. ఇందులో ప్రియాంక చోప్రా బ్లూ కలర్ గాగ్రా లెహంగాలో తళుక్కుమంటే నిక్ జోనాస్ క్రీమ్ కలర్ షేర్వాణి సూట్‌లో అందంగా కనిపించాడు.  

(4 / 8)

ప్రస్తుతం ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, సిద్ధార్థ్ చోప్రా వివాహం చేసుకున్న నీలం ఉపాధ్యాయ ఎవరు అనే ఆసక్తి నెలకొంది. 

(5 / 8)

సిద్ధార్థ్ చోప్రా పెళ్లి చేసుకున్న నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. 2012లో నక్షత్ర అనే మూవీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నీలం ఉపాధ్యాయ.

(6 / 8)

నక్షత్ర సినిమా తర్వాత 2013లో యాక్షన్ 3డి మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది నీలం ఉపాధ్యాయ. ఇందులో హీరో అల్లరి నరేష్ పక్కన జోడీగా నటించింది. అనంతరం తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నీలం ఉపాధ్యాయ.  

(7 / 8)

ఉన్నోడు ఒరు నాల్, ఓం శాంతి ఓం వంటి తమిళ చిత్రాల్లో నటించిన నీలం ఉపాధ్యాయ మళ్లీ 2018లో పండగల వచ్చాడు, తమషా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. ఇప్పుడు ప్రియాంక చోప్రా తమ్ముడుని పెళ్లి చేసుకుని నీలం చోప్రాగా మారింది. 

(8 / 8)

ఇతర గ్యాలరీలు