(1 / 5)
టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ తో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ఎంగేజ్ మెట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాబోయే దంపతులు తీసుకున్న ఈ క్యూట్ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
(Priya Saroj X)(2 / 5)
రింకు సింగ్ తో నిశ్చితార్థం నేపథ్యంలో ప్రియా సరోజ్ పేరు హాట్ టాపిక్ గా మారింది. ఈ లోక్ సభ ఎంపీ నెట్ వర్త్ చర్చనీయాంశంగా మారింది. అయితే 2024 లోక్ సభ ఎన్నికల అఫిడావిట్ ప్రకారం ప్రియా ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవుతారు.
(Sansad TV)(3 / 5)
ఎన్నికల సందర్భంగా ప్రియా సరోజ్ సమర్పించి అఫిడావిట్ ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ.11.25 లక్షలు మాత్రమే. ఆమె దగ్గర రూ.75 వేల నగదు ఉందని పేర్కొన్నారు. కెనరా బ్యాంకులో రూ.8,719, యూనియన్ బ్యాంక్ లో రూ.10.10 లక్షలున్నట్లు తెలిపారు.
(Priya Saroj X)(4 / 5)
అఫిడావిట్ ప్రకారం ప్రియా సరోజ్ కు ఎలాంటి స్థలం, ఇల్లు, కారు లేదు. ఆమె దగ్గర 5 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. ఎలాంటి పెట్టుబడులూ పెట్టలేదు.
(Rahul Singh)(5 / 5)
ప్రియా సరోజ్ తండ్రి తుఫాని సరోజ్ మూడు సార్లు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. 25 ఏళ్లకే ఎంపీగా గెలిచిన ప్రియా సరోజ్.. లోక్ సభకు ఎన్నికైన రెండో అత్యంత పిన్నవయస్సు క్యాండిడేట్ గా నిలిచారు.
(@yadavakhilesh)ఇతర గ్యాలరీలు