రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి సాదరంగా అహ్వానం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు.
(1 / 12)
వేదపండితులు, ఆలయ అధికారులతో రాష్ట్రపతి ముర్ము
(2 / 12)
తిరుమల శ్రీవారి దర్శనానికి బ్యాటరీ వాహనంలో వెళుతున్న రాష్ట్రపతి ముర్ము
(3 / 12)
శ్రీవారి దర్శనానంతరం ప్రసాదం అంద చేస్తున్న టీటీడీ ఛైర్మన్
(4 / 12)
తిరుమలలో స్వామి వారి దర్శనానంతరం రాష్ట్రపతి ముర్ము
(5 / 12)
స్వామి వారి దర్శనానంతరం అధికారులు, మంత్రులతో రాష్ట్రపతి
(6 / 12)
రాష్ట్రపతికి వేద పండితుల ఆశీర్వచనాలు
(7 / 12)
తిరుమల స్వామి వారి దర్శనానంతరం స్వామి సన్నిధిలో రాష్ట్రపతి
(8 / 12)
వేంకటేశ్వరుడి దర్శనానికి వెళుతున్న రాష్ట్రపతి ముర్ము
(9 / 12)
తిరుమల శ్రీవారి దర్శనానంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
(10 / 12)
తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల మంత్రులు, అధికారులతో రాష్ట్రపతి
(11 / 12)
ఆలయ ధ్వజ స్తంభానికి నమస్కరిస్తున్న రాష్ట్రపతి ముర్ము
(12 / 12)
తిరుమల వేంకటేశ్వరుడి చిత్రాన్ని రాష్ట్రపతికి బహుకరిస్తున్న ఆలయ అధికారులు