KapilDev Meets CBN: ఏపీలో మూడు గోల్ఫ్ కోర్సుల ఏర్పాటుకు సన్నాహాలు, చంద్రబాబుతో కపిల్ దేవ్ చర్చలు
- KapilDev Meets CBN: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, అమరావతి, విశాఖల్లో గోల్ఫ్ కోర్సుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబుతో క్రికెటర్, గోల్ఫ్ ఇండియా ఛైర్మన్ కపిల్ దేవ్ భేటీ అయ్యారు. క్రీడలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఉన్నారని ,గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చించారు.
- KapilDev Meets CBN: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, అమరావతి, విశాఖల్లో గోల్ఫ్ కోర్సుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబుతో క్రికెటర్, గోల్ఫ్ ఇండియా ఛైర్మన్ కపిల్ దేవ్ భేటీ అయ్యారు. క్రీడలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఉన్నారని ,గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చించారు.
(1 / 6)
మంగళగిరి, విశాఖ పట్టణంలోని క్రికెట్ స్టేడియాలను అంతర్జాతీయ స్టేడియాలు రెడీ చేస్తున్నట్లు ACA ప్రతినిధులు తెలిపారు.ఈస్టేడియాల నిర్మాణ విషయంలో కపిల్ దేవ్ సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని యువ క్రికెట్ క్రీడాకారులు నేషనల్, ఇంటర్నేషన్ క్రికెట్ మ్యాచ్, ఐపిఎల్ లో ఆడే విధంగా అకాడమీలు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ సెంటర్స్ మూడు ప్రారంభించబోతున్నట్లు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్స్ డెవలప్ చేయటనున్నట్లు తెలిపారు. అవి ప్రారంభించి అరకు ,కళ్యాణ దుర్గం వంటి గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ను అభివృద్ది చేసేందుకు కృషి చేయనున్నట్లు ఏసీఏ తెలిపింది.
(2 / 6)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, గోల్ప్ టూర్ ఆప్ ఇండియా చైర్మన్ కపిల్ దేవ్ , ఎసిఎ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో మంగళవారం కలిశారు. కపిల్ దేవ్ కి సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ క్లబ్ ఏర్పాటుపై పలు అంశాలు చర్చించుకున్నారు.
(3 / 6)
అనంతపురం, అమరావతి, విశాఖలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై సీఎంతో కపిల్‌దేవ్ చర్చించారు. ఏపీ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై ఆడేందుకు కృషి చేయడంతో పాటు, గ్రామీణ క్రికెట్ క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.
(4 / 6)
ఏపీకి అంబాసిడర్ గా కపిల్ దేవ్ ను ఉండాలని కోరగా, అందుకు కపిల్ అంగీకరించినట్లు ఎంపీ చిన్ని తెలిపారు. రాష్ట్రంలో గోల్ఫ్ అభివృద్ధి చేయాలనే యోచనలో వున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కపిల్ దేవ్ క్రికెట్,గోల్ఫ్ గేమ్స్ కి సంబంధించి అనేక అంశాలతో పాటు వాటికి అభివృద్ధికి సంబంధించి సలహాలు సూచనలు అందించారు. గోల్ఫ్ కోర్స్ అమరావతిలోనే కాకుండా కియా పరిశ్రమ వున్న అనంతపురంలో ఏర్పాటు చేసే అంశంపై చర్చించటం జరిగిందన్నారు. కియా పరిశ్రమలోని ఉద్యోగులు చాలా మంది బెంగుళూర్ వెళ్లి గోల్ఫ్ ఆడుతున్నారన్నారు. ముందుగా అనంతపురం, ఆతర్వాత అమరావతి ప్రాంతంలో , వైజాగ్ చేస్తారని వెల్లడించారు.
(5 / 6)
విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన గోల్ఫ్ ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రాచుర్యం సంపాదించుకుంటుంది. క్రికెట్ తర్వాత అంత ఖరీదైన క్రీడ గోల్ఫ్ అని పేర్కొన్నారు. గోల్ప్ టూర్ ఆప్ ఇండియా చైర్మన్ కపిల్ దేవ్ త్వరలో ఐపిఎల్ లాగా గోల్ప్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయబోతున్నారు. గోల్ప్ ప్రీమియర్ లీగ్ లో ఎపి నుంచి ఒక టీమ్ వుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో గోల్ఫ్ పై ఆసక్తి వున్నా సరైన సదుపాయాలు లేవు. వారి కోసం డ్రైవింగ్ రెంజ్ లు ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. రెండు సంవత్సరాల్లో గోల్ఫ్ కోర్స్ పూర్తి అయ్యే సమయానికి గోల్ప్ క్రీడాకారులగా తీర్చిదిద్దే విధంగా ఆలోచన చేయటం జరిగిందన్నారు.
(6 / 6)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి క్రీడలపట్ల చాలా ఆసక్తి ఉందని, హైదరాబాద్ లో స్పోర్ట్స్ సిటీ రావటానికి ఆయన చేసిన కృషే కారణమని, ఇప్పుడు ఎపిలో కూడా క్రీడాభివృద్ది కి కృషి చేస్తున్నారని తెలిపారు. అందుకే రాష్ట్రంలో క్రికెట్ తోపాటు అన్ని క్రీడలను ప్రోత్సహించటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా వుందని ఏసీఏ అధ్యక్షుడు , ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
ఇతర గ్యాలరీలు