(1 / 10)
78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచిన తెలుగు హీరోయిన్ ప్రణీత సుభాష్ ఆ అందమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
(2 / 10)
డిఫరెంట్‌గా ఉన్న ఎరుపు రంగు దుస్తులతో పాటు బేబీ పింక్ డ్రెస్, చీరలో కూడా మెరిసింది ప్రణీత సుభాష్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
(3 / 10)
'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై కనిపించాలని చిన్నప్పటి నుంచీ అనుకుంటున్నాను. ఆ చిన్ననాటి కల ఇప్పుడు నెరవేరింది.. భారతీయ సినిమా ఈ స్థాయికి వచ్చింది కాబట్టే మాకు ఈ అవకాశం వచ్చింది' అని ప్రణీత అన్నారు.
(4 / 10)
78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13 నుంచి మే 24 వరకు జరగనుంది. కేన్స్ ఫెస్టివల్‌కు ఈ రోజు చివరి రోజు. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనే అవకాశం కొద్దిమంది నటీమణులకు మాత్రమే దక్కుతుంది. ప్రణీత సుభాష్‌కు కూడా ఈ అవకాశం దక్కింది.
(5 / 10)
ఐశ్వర్య రాయ్, జాన్వీ కపూర్, అదితిరావు హైదరి, దిశా మదన్ తదితరులు ఈ ఏడాది కేన్స్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. వీరితోపాటు హాజరైన ప్రణీత సుభాష్ అందాలతో అలరించింది.
(6 / 10)
ప్రణీత సుభాష్ కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
(7 / 10)
ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ సరసన పోర్కీ చిత్రంతో ప్రణీత సుభాష్ తన సినీ జీవితాన్ని ప్రారంభించారు.
(8 / 10)
నటనతో పాటు మోడలింగ్‌లోనూ యాక్టివ్‌గా ఉన్న ప్రణీత సుభాష్ జాయ్ అలుకాస్ సహా పలు బ్రాండ్లతో కలిసి పనిచేసింది.
(9 / 10)
హీరోయిన్‌గానే కాకుండా బిజినెస్‌లో రాణిస్తోంది ప్రణీత సుభాష్. ఆమెకు బెంగుళూరులో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ప్రణీత సుభాష్ కన్నడలో జరాసంధ, బ్రహ్మ, అంగరక వంటి చిత్రాలలో నటించింది.
(10 / 10)
విజన్‌లో ప్రణీత సుభాష్ అద్భుతంగా నటించింది. దీంతో ప్రణీత సైమా అవార్డుకు నామినేట్ అయింది. ఇక ప్రణీత సుభాష్ వ్యాపారవేత్త నితిన్ రాజ్‌ను 2021లో వివాహం చేసుకుంది.
ఇతర గ్యాలరీలు