Bal Jeevan Bima Yojana : రోజుకు రూ.6 చెల్లిస్తే రూ.1 లక్ష బెనిఫిట్ -పోస్టాఫీసులో అద్భుతమైన పథకం-postal insurance scheme bal jeevan bima yojana invest 6 rupees daily gets one lakh benefit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bal Jeevan Bima Yojana : రోజుకు రూ.6 చెల్లిస్తే రూ.1 లక్ష బెనిఫిట్ -పోస్టాఫీసులో అద్భుతమైన పథకం

Bal Jeevan Bima Yojana : రోజుకు రూ.6 చెల్లిస్తే రూ.1 లక్ష బెనిఫిట్ -పోస్టాఫీసులో అద్భుతమైన పథకం

Jan 04, 2025, 02:04 PM IST Bandaru Satyaprasad
Jan 04, 2025, 02:04 PM , IST

Bal Jeevan Bima Yojana : మీ పిల్లల భవిష్యత్ అవసరాలకు ఇన్యూరెన్స్ చక్కటి ఆలోచన. బాల జీవన్ బీమా యోజన...భారతీయ పోస్ట్ ఆఫీస్ పిల్లలకు సంబంధించిన జీవిత బీమా పథకాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద తల్లిదండ్రులు పోస్టాఫీసు ఖాతాలో రోజుకు రూ. 6 డిపాజిట్ చేస్తే... లబ్దిదారుడు రూ. 1 లక్ష పొందుతారు.

మీ పిల్లల భవిష్యత్ అవసరాలకు ఇన్యూరెన్స్ చక్కటి ఆలోచన. పోస్టల్ శాఖ పిల్లల కోసం 'బాల్ జీవన్ బీమా' పాలసీ అందిస్తోంది. బాల జీవన్ బీమా యోజన...భారతీయ పోస్ట్ ఆఫీస్ అందించే పిల్లలకు సంబంధించిన జీవిత బీమా పథకం. ఈ పథకం కింద తల్లిదండ్రులు పోస్టాఫీసు ఖాతాలో రోజుకు రూ. 6 డిపాజిట్ చేస్తే... లబ్దిదారుడు రూ. 1 లక్ష పొందుతారు.   

(1 / 7)

బాల్ జీవన్ బీమా యోజన కోసం దరఖాస్తు చేయడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారికి దగ్గర్లోని పోస్టాఫీసును సంప్రదించవచ్చు. పోస్టాఫీసులో ఇచ్చే దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. ఫారమ్‌లో పిల్లల పేరు, వయస్సు, అడ్రస్ వివరాలు, తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తుదారుడు గుర్తింపు, చిరునామా రుజువు కోసం కొన్ని పత్రాలు అందించాలి. బాల్ జీవన్ బీమా పథకానికి 5 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకు ఈ పాలసీ తెరవచ్చు.   

(2 / 7)

బాల్ జీవన్ బీమ్ పాలసీ ముఖ్యాంశాలు  పాలసీదారుడి(తల్లిదండ్రులు) గరిష్టంగా ఇద్దరు పిల్లలు అర్హులు5-20 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు అర్హులుపాలసీదారుడి వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు.పాలసీదారుడు మరణిస్తే, పిల్లల పాలసీపై ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత పూర్తి మొత్తం, బోనస్ చెల్లిస్తాయి. పాలసీదారుడు పిల్లల పాలసీ ప్రీమియం చెల్లిస్తారు. దీనిపై రుణ సదుపాయం లేదుసరెండర్ సదుపాయం అందుబాటులో లేదుపిల్లలకు ఎలాంటి వైద్య పరీక్ష అవసరం లేదు. అయితే, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ప్రపొజల్ ఆమోదించిన రోజు నుంచి రిస్క్ కవర్ ప్రారంభ అవుతుంది. చివరి బోనస్ రేటు సంవత్సరానికి రూ.1000 మొత్తానికి రూ.  48 బోసన్ అందించారు.  

(3 / 7)

పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారుడు మరణిస్తే ఆ తర్వాత పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ గడువు ముగిసిన తర్వాత పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తాన్ని చెల్లిస్తారు.  

(4 / 7)

ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ. 3 లక్షల వరకు హామీ మొత్తం పొందవచ్చు. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఈ పాలసీని తీసుకున్నట్లయితే పాలసీదారు రూ. 1 లక్ష వరకు హామీ మొత్తాన్ని పొందుతారు.  గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఈ పాలసీని తీసుకుంటే రూ. 1000 హామీ మొత్తంపై మీకు ఏటా  రూ. 48 బోనస్ ఇస్తారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద ప్రతి ఏటా రూ. 52 బోనస్ ఇస్తారు. 

(5 / 7)

ఈ పథకంలో నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా ప్రీమియం చెల్లించవచ్చు. ఐదేళ్ల పాటు రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించిన తర్వాత... పాలసీ చెల్లింపు అవుతుంది. ఒకవేళ బిడ్డ చనిపోయినా, నామినీకి బోనస్‌తో పాటు బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. 

(6 / 7)

చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద, మీరు మీ పిల్లలకు రోజుకు రూ. 6 నుంచి రూ. 18 వరకు ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు. ఒక పాలసీదారు 5 సంవత్సరాల పాటు పాలసీని కొనుగోలు చేస్తే, అతను ప్రతిరోజూ రూ. 6 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పాలసీని 20 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తే రోజుకు రూ.18 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.  

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు