70ఏళ్ల నాటి చీరలో పూజా హెగ్డే.. ట్రెడిషనల్ లుక్‍లో మరింత అందంగా స్టార్ హీరోయిన్: ఫొటోలు-pooja hegde shines in 70 years old grandma saree beautiful photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  70ఏళ్ల నాటి చీరలో పూజా హెగ్డే.. ట్రెడిషనల్ లుక్‍లో మరింత అందంగా స్టార్ హీరోయిన్: ఫొటోలు

70ఏళ్ల నాటి చీరలో పూజా హెగ్డే.. ట్రెడిషనల్ లుక్‍లో మరింత అందంగా స్టార్ హీరోయిన్: ఫొటోలు

Published Apr 27, 2025 06:56 PM IST Chatakonda Krishna Prakash
Published Apr 27, 2025 06:56 PM IST

హీరోయిన్ పూజా హెగ్డే తన అమ్మమ్మ చీర ధరించారు. విటేంజ్ లుక్‍లో మరింత అందంగా కనిపించారు. ఆ బ్యూటిఫుల్ ఫొటోలను ఇక్కడ చూసేయండి.

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం రెట్రో సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. 1990ల బ్యాక్‍డ్రాప్‍లో ఉండే ఈ మూవీలో సూర్య సరసన నటించారు ఈ బ్యూటీ. ఆ సినిమా వైబ్‍కు తగ్గట్టుగా తాజాగా చీరకట్టులో మెరిశారు పూజా.

(1 / 6)

70ఏళ్ల నాటి తన అమ్మమ్మ చీరను ధరించారు పూజా హెగ్డే. వింటేజ్ లుక్‍లో మరింత గ్లామరస్‍గా కనిపించారు. సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్నారు ఈ భామ.

(2 / 6)

అందమైన నవ్వులు చిందిస్తూ, తలకు మల్లెపూలు, మెడలో నక్లెస్, చేతులకు సింపుల్ గాజులతో పూజా ట్రెడిషనల్ లుక్ అదిరిపోయింది. బ్యూటిఫుల్ పోజులతో ఈ అమ్మడు ఆకట్టుకున్నారు.

(3 / 6)

70 సంవత్సరాల అద్భుతమైన చీర అంటూ అందమైన క్యాప్షన్‍తో ఈ ఫొటోలను నేడు (ఏప్రిల్ 27) సోషల్ మీడియాలో షేర్ చేశారు పూజా హెగ్డే. తనకు అమ్మమ్మ కాలం నాటి ఫొటోలు గుర్తుకు వస్తున్నాయంటూ రాసుకొచ్చారు.

(4 / 6)

“70ఏళ్ల కిందటి ఓ అద్భుతమైన చీర. మా అమ్మమ్మ అద్బుతమైన పెళ్లి ఫొటోలను ఆమెకు చెందిన ఈ చీర నాకు గుర్తు చేస్తోంది” అని పూజా హెగ్డే క్యాప్షన్ పెట్టారు.  పెళ్లికి వెళ్లే ముందు ఇంట్లో మల్లెపూల వాసన, తొలకరి సమయంలో మంగళూరు మట్టి నుంచి వచ్చే సువాసన అంటూ రాసుకొచ్చారు. చిన్న విషయాల్లోనే చాలా అందం దాగుంటుందని పేర్కొన్నారు. ఒకప్పటి లెన్స్ ద్వారానే ఈ ఫొటోలను తీసినట్టు కూడా పూజా తెలిపారు.

(5 / 6)

రెట్రో సినిమా మే 1వ తేదీన విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగునూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా డీగ్లామర్ లుక్‍లో పూజా నటించారు. సూర్య హీరోగా చేసిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు.

(6 / 6)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు