తెలుగు న్యూస్ / ఫోటో /
Pooja Hegde: సూర్య రెట్రో కోసం తమిళంలో పూజా హెగ్డే ఫస్ట్ టైమ్ సొంత డబ్బింగ్
Pooja Hegde: పూజాహెగ్డే హిట్టు అందుకొని చాలా కాలమైంది. తెలుగుతో పాటు తమిళంలో పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తోన్న ఈ బ్యూటీ సూర్య రెట్రో మూవీపైనే బోలెడు ఆశలు పెట్టుకుంది.
(1 / 5)
రొమాంటిక్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న రెట్రో మూవీకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. మే 1న ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
(2 / 5)
రెట్రో మూవీలో తన పాత్రకు పూజాహెగ్డే సొంతంగా డబ్బింగ్ చెప్పిందట. ఈ మూవీ కోసం ఫస్ట్ టైమ్ తమిళంలో సొంత గళం వినిపించినట్లు చెబుతోన్నారు.
(3 / 5)
రెట్రో మూవీతో దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది పూజా హెగ్డే. 2022లో రిలీజైన దళపతి విజయ్ బీస్ట్‌లో చివరగా కనిపించింది పూజాహెగ్డే.
(4 / 5)
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కూలీ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు