TSPSC Paper Leak : గన్‌పార్కు వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్ అరెస్ట్
Bandi Sanjay Deeksha at GunPark: హైదరాబాద్ గన్ పార్కు వద్ద దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ దీక్షకు దిగిన బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
(1 / 5)
బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్సీ ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. (twitter)
(2 / 5)
దీక్షలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతుండగానే పోలీసులు మైక్ కట్ చేశారు. వెంటనే వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. (twitter)
(3 / 5)
దీక్ష ముగించే సమయంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్తామని బండి సంజయ్ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్‌పార్కు నుంచి బయల్దేరే క్రమంలో వారిని చుట్టుముట్టారు. (twitter)
(4 / 5)
పోలీస్ వాహనాన్ని ముందుకు వెళ్లకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. అడ్డుకున్న కార్యకర్తలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (twitter)
(5 / 5)
పేపర్ లీకేజీ వ్యవహారంపై త్వరగా విచారణ చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అరెస్ట్ తర్వాత… బండి సంజయ్ ను కార్ఖానా పోలీస్ స్టేషన్ కు తరలించారు.(twitter)
ఇతర గ్యాలరీలు