Multibagger Stock: నెలలోనే 500శాతం లాభం.. ఇన్వెస్టర్ల పంట పండించిన ఈ కంపెనీ ఐపీవో-pngs gargi fashion jewellery ipo gives 506 returns in 20 days of listing know full details ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Pngs Gargi Fashion Jewellery Ipo Gives 506 Returns In 20 Days Of Listing Know Full Details

Multibagger Stock: నెలలోనే 500శాతం లాభం.. ఇన్వెస్టర్ల పంట పండించిన ఈ కంపెనీ ఐపీవో

Jan 18, 2023, 11:23 AM IST Chatakonda Krishna Prakash
Jan 18, 2023, 11:23 AM , IST

  • Multibagger Stock: ఓ స్మాల్ క్యాప్ కంపెనీ.. స్టాక్ మార్కెట్‍లో సంచలనం సృష్టించింది. ఐపీవోకు వచ్చి నెల రోజులు ముగియకుండానే ఏకంగా ఇన్వెస్టర్లకు 506శాతం లాభాలను ఇచ్చింది. పీఎన్‍జీఎస్ గార్గి ఫ్యాషన్ జ్యువెలరీ (PNGS Gargi Fashion Jewellery) అనే సంస్థ ఐపీవోకు వచ్చి నెల ముగియకుండానే ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్నులను ఇచ్చింది. ఈ కంపెనీ స్టాక్స్ గతేడాది డిసెంబర్ 20న స్టాక్ మార్కెట్‍లో లిస్ట్ అయ్యాయి. కొంతకాలానికే.. ఇన్వెస్టర్లకు భారీగా లాభాలను ఈ కంపెనీ తెచ్చిపెట్టింది. వివరాలు ఇవే.

పీఎన్‍‍జీఎస్ గార్గి ఫ్యాషన్ జువెలరీ.. ఐపీవో చెరో షేర్ ధర రూ.30గా ఉంది.  ఇష్యూ ప్రైజ్ నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్ 506 శాతం పెరిగింది. చాలా రోజులు అప్పర్ సర్క్యూట్ కొట్టింది. బుధవారం నాటికి ఈ షేర్ ధర రూ.158.20 వద్ద ఉంది.  

(1 / 4)

పీఎన్‍‍జీఎస్ గార్గి ఫ్యాషన్ జువెలరీ.. ఐపీవో చెరో షేర్ ధర రూ.30గా ఉంది.  ఇష్యూ ప్రైజ్ నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్ 506 శాతం పెరిగింది. చాలా రోజులు అప్పర్ సర్క్యూట్ కొట్టింది. బుధవారం నాటికి ఈ షేర్ ధర రూ.158.20 వద్ద ఉంది.  (MINT_PRINT)

పీఎన్‍జీఎస్ గార్గి ఫ్యాషన్ జ్యువెలరీ ఐపీవో డిసెంబర్‌లో జరిగింది. ఇష్యూ సమయంలో ఒక్కో షేర్ ధర రూ.30గా ఉంది. డిసెంబర్ 20న కంపెనీ స్టాక్ మార్కెట్‍లో లిస్ట్ అయింది. లిస్టింగ్ రోజునే సుమారు 100 శాతం పెరిగి రూ.59.85కు షేర్ ధర చేరింది. ఆ తర్వాతి నుంచి చాలా రోజులు అప్పర్ సర్క్యూట్‍కు చేరుతూనే ఉంది. 

(2 / 4)

పీఎన్‍జీఎస్ గార్గి ఫ్యాషన్ జ్యువెలరీ ఐపీవో డిసెంబర్‌లో జరిగింది. ఇష్యూ సమయంలో ఒక్కో షేర్ ధర రూ.30గా ఉంది. డిసెంబర్ 20న కంపెనీ స్టాక్ మార్కెట్‍లో లిస్ట్ అయింది. లిస్టింగ్ రోజునే సుమారు 100 శాతం పెరిగి రూ.59.85కు షేర్ ధర చేరింది. ఆ తర్వాతి నుంచి చాలా రోజులు అప్పర్ సర్క్యూట్‍కు చేరుతూనే ఉంది. (MINT_PRINT)

గతేడాది డిసెంబర్ 8న ఈ కంపెనీ ఐపీవో సబ్‍స్క్రిప్షన్ మొదలైంది. డిసెంబర్ 13 వరకు కొనసాగింది. కంపెనీ ఐపీవో ఒక్కో లాట్‍లో 4,000 షేర్స్ ఉన్నాయి. ఐపీవోలో రూ.1.2లక్షల పెట్టుబడి పెడితే.. ఇప్పుడు అది రూ.7.27లక్షలకు పెరిగి ఉంటుంది. 

(3 / 4)

గతేడాది డిసెంబర్ 8న ఈ కంపెనీ ఐపీవో సబ్‍స్క్రిప్షన్ మొదలైంది. డిసెంబర్ 13 వరకు కొనసాగింది. కంపెనీ ఐపీవో ఒక్కో లాట్‍లో 4,000 షేర్స్ ఉన్నాయి. ఐపీవోలో రూ.1.2లక్షల పెట్టుబడి పెడితే.. ఇప్పుడు అది రూ.7.27లక్షలకు పెరిగి ఉంటుంది. (MINT_PRINT)

గమనిక: స్టాక్ పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే ఈ సమాచారం. ఈ కథనం ఇన్వెస్ట్‌మెంట్ సిఫారసు కాదు. స్టాక్ మార్కెట్‍లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు పూర్తి విషయాలు తెలుసుకోవాలి, అలాగే ఫైనాన్షియల్ అడ్వెయిజర్‌ను సంప్రదించాలి.

(4 / 4)

గమనిక: స్టాక్ పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే ఈ సమాచారం. ఈ కథనం ఇన్వెస్ట్‌మెంట్ సిఫారసు కాదు. స్టాక్ మార్కెట్‍లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు పూర్తి విషయాలు తెలుసుకోవాలి, అలాగే ఫైనాన్షియల్ అడ్వెయిజర్‌ను సంప్రదించాలి.(REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు