AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవల్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ-pm modi virtually launched drone services at mangalagiri aiims ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Aiims Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవల్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవల్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Oct 30, 2024, 08:32 AM IST Bolleddu Sarath Chandra
Oct 30, 2024, 08:32 AM , IST

  • AIIMS Mangalagiri: నాణ్యమైన వైద్య సేవలకు పేరొందిన ఎయిమ్స్‌లో ఇప్పుడు డ్రోన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌లతో వైద్య సేవలు ప్రారంభం అయ్యాయి.మంగళవారం ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా డ్రోన్‌ సేవల్ని ప్రారంభించారు.18కిలోమీటర్ల ప్రయాణాన్ని డ్రోన్ పావుగంటలో పూర్తి చేసింది. 

మంగళవారం ధన్వంతరి జయంతి,  9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) పథకం మరియు బహుళ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టుల విస్తరణను  ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎయిమ్స్‌కేంద్రాల్లో డ్రోన్లను ప్రవేశపెట్టారు. 

(1 / 7)

 ఆరోగ్య సేవల కోసం డ్రోన్ సేవల సదుపాయాన్ని ప్రారంభించడంలో భాగంగా, AIIMS మంగళగిరి ఆడిటోరియంలో  వర్చువల్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. AIIMS మంగళగిరి నుంచి నూతక్కిలో ఉన్న ఎయిమ్స్‌ హెల్త్‌ సెంటర్ మధ్య డ్రోన్ సేవ ప్రారంభించారు. 

(2 / 7)

మంగళగిరి ఎయిమ్స్‌కు 9కి.మీ దూరంలో ఉన్న నూతక్కిలో రోగి  బ్లడ్ శాంపుల్స్‌ తీసుకుంటున్న డ్రోన్. ఎయిమ్స్ వైద్య సేవల్లో డ్రోన్లను లాంఛనంగా ప్రశేశపెట్టారు. మంగళవారం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

(3 / 7)

 AIIMS మంగళగిరి డైరెక్టర్, CEO ప్రొఫెసర్ డాక్టర్ మధబానంద కర్ సమక్షంలో ఎయిమ్స్‌ నూతక్కి కేంద్రం నుంచి. గర్భిణీ స్త్రీ రక్త నమూనాలను సేకరించి నూతక్కి నుండి AIIMS ఆసుపత్రికి 9 నిమిషాల వ్యవధిలో చేరుకుంది. వారంలో రెండు సార్లు ఈ డ్రోన్ సర్వీసుల్ని వినియోగిస్తారు. గరిష్టంగా 5కేజీల వరకు డ్రోన్‌తో రవాణా చేయొచ్చని చెబుతున్నారు. 

(4 / 7)

నూతక్కిలో ఉన్న ఎయిమ్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ నుంచి పంపిన గర్భిణీ స్త్రీ రక్త నమూనాలను మంగళగిరి ఎయిమ్స్‌ సిబ్బంది  9నిమిషాల వ్యవధిలోనే అందుకున్నారు. 

(5 / 7)

గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందించడానికి డ్రోన్లు విస్తృతంగా ఉపయోగపడతాయని ఎయిమ్స్‌ డైరెక్టర్ కర్ వివరించారు. భవిష్యత్తులో ఈ సేవలు మరితంగా విస్తరిస్తాయని చెప్పారు. అవయవదానం సమయంలో ఇప్పుడు ఉన్న గ్రీన్ ఛానల్ ఇబ్బందులను భవిష్యత్తులో అధిగమించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 

(6 / 7)

ఎయిమ్స్‌లో డ్రోన్ల వినియోగాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో  వైద్య విద్యార్థులు తరలి వచ్చారు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు