Team India with Modi: దటీజ్ మోదీ! టైటిల్ కాకుండా రోహిత్, ద్రవిడ్ చేతులు పట్టుకున్న ప్రధాని: ఫొటోలు
Team India with Modi: టీ20 ప్రపంచకప్ టైటిల్‍ను కైవసం చేసుకున్న భారత జట్టు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నేడు (జూలై 4) కలిసింది. ఆటగాళ్లు, కోచ్‍లతో ప్రధాని మోదీ మాట్లాడారు.
(1 / 6)
టీ20 ప్రపంచకప్ 2024 విశ్వవిజేతగా నిలిచిన భారత ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ఢిల్లీలో నేడు (జూలై 4) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అందరితో మోదీ మాట్లాడారు.
(2 / 6)
భారత్ జట్టుతో కలిసి టీ20 ప్రపంచచకప్ టైటిల్‍తో ఫొటో దిగారు ప్రధాని మోదీ. ఆ సమయంలో టైటిల్‍ను తన చేత్తో నేరుగా పట్టుకోలేదు ప్రధాని. టైటిల్ పట్టుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతులను మోదీ పట్టుకున్నారు. కష్టపడి టైటిల్ సాధించిన వారి కృషిని గౌరవిస్తూ మోదీ ఇలా చేశారు. దీంతో దటీజ్ మోదీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
(3 / 6)
టీమిండియా ప్లేయర్లతో సరదాగా నవ్వతూ మాట్లాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆటగాళ్లు చుట్టూ కూర్చొని ప్రధాని అడిగిన విషయాలపై మాట్లాడారు.
(4 / 6)
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరచాలనం చేశారు. ఇతర ఆటగాళ్లకు కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చారు పీఎం.
(5 / 6)
స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్ ప్రధాని మోదీతో ఫొటోకు పోజిచ్చారు. బుమ్రా, సంజనా కుమారుడు అంగద్‍ను మోదీ ఆప్యాయంగా ఎత్తుకున్నారు.
ఇతర గ్యాలరీలు