(1 / 5)
శుక్రవారం ఉదయం అహ్మదాబాద్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
(PMO)(2 / 5)
ఎయిరిండియా విమాన ప్రమాదంలో బతికి బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్‌ని ప్రధానమంత్రి మోదీ పరామర్శించారు.
(PMO)(3 / 5)
“ఇది మాటలకు అందని విషాదం. అనూహ్యంగా ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. మీ బాధను మేము అర్థం చేసుకోగలము. మీ జీవితంలో ఏర్పడిన లోటును అర్థం చేసుకోగలము,” అని ప్రధాని మోదీ అన్నారు.
(PMO)(4 / 5)
ఆసుపత్రిలో క్షతగాత్రులను కలవడంతో పాటు అహ్మదాబాద్ విమానశ్రయం సమీపంలో ఎయిరిండియా విమానం కూలిన ప్రాంతాన్ని సైతం మోదీ సందర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
(5 / 5)
విమానం కూలిన ప్రాంతం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఇతర గ్యాలరీలు