(1 / 6)
రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం పీఎం కిసాన్ 19వ వితడ నిధులు ఖాతాల్లో జమ అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. బిహార్‌లోని భాగల్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద నిధులు విడుదల చేశారు. 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేశారు.
(2 / 6)
దేశవ్యాప్తంగా 2.41 కోట్ల మంది మహిళా రైతులతో సహా 9.8 కోట్ల మంది రైతులకు 19వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా డీబీటీ విధానంలో రూ.22,000 కోట్లు రైతులు ఆర్థిక సహాయంగా అందుకుంటారు.
(3 / 6)
పీఎం కిసాన్ పథకాన్ని రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద, సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం, మూడు సమాన వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) మోడ్ ద్వారా రైతుల ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు.
(4 / 6)
రైతులకు ఒక్కో విడతలో రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తారు. 19వ విడత పీఎం కిసాన్ డబ్బు ఖాతాలో జమయ్యిందా? లేదో? ఈ కింది విధంగా తెలుసుకోవచ్చు.
(5 / 6)
1. పీఎమ్ కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ను సందర్శించాలి.
2. కుడి వైపున కనిపిస్తున్న ఫార్మర్ కార్నర్ ఆప్షన్ లో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది
3. బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేసి ఆధార్ లేదా ఖాతా నెంబరును ఎంటర్ చేసి 'గెట్ డేటా'పై క్లిక్ చేయాలి.
4.స్క్రీన్‌పై స్టేటస్ కనిపిస్తుంది. పీఎం కిసాన్‌కు రిజిస్టర్ చేసుకుని, ఈకేవైసీ పూర్తి చేస్తే ఖాతాలోకి డబ్బు జమ అవుతాయి.
(6 / 6)
లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో? లేదో? కూడా చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లబ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాలను ఎంచుకుని గెట్ రిపోర్టుపై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా డిస్ ప్లే అవుతుంది.
ఇతర గ్యాలరీలు