తెలుగు న్యూస్ / ఫోటో /
PM Internship Scheme 2024 : నెలకు రూ.5 వేల స్టైఫండ్ - పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ..!
- PM Internship Scheme Registrations : పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ అప్లికేషన్లు ఇవాళ్టితో(నవంబర్ 15) ముగియనున్నాయి. అర్హులైన అభ్యర్థులు pminternship.mca.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో ఎంపికైన వారికి నెలకు రూ.5 వేలు స్టైఫండ్ అందుతుంది. పూర్తి వివరాలను చూడండి…

(1 / 6)
కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్’ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టాప్-500 కంపెనీల్లో యువతకు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు.
(2 / 6)
పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన 1.25 లక్షల మందికి అవకాశాన్ని ఇచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు గడువు ఇవాళ్టితో(నవంబర్ 15, 2024) పూర్తి అవుతుంది.
(3 / 6)
పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హతలున్న 21-24 ఏళ్ల యువత ఈ ఇంటర్న్ షిప్ లో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎంపికైనవారికి నెలకు రూ.5 వేల చొప్పున అందిస్తారు. ఇలా సంవత్సరం పాటు అందుతుంది.
(4 / 6)
అర్హులైన అభ్యర్థులు https://pminternship.mca.gov.in వెబ్‌సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారు ప్రభుత్వం నుంచి నెలవారీగా రూ.4,500, కంపెనీ నుంచి రూ.500 స్టైఫండ్ అందుకుంటారు. అలాగే రూ.6,000 వన్-టైమ్ గ్రాంట్‌కు కూడా అర్హులవుతారు.
(5 / 6)
తెలంగాణలో ఏడు వేలకుపైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు లేదా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు.
ఇతర గ్యాలరీలు