Champions Trophy: సమరానికి కుర్రాళ్లు సై..ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్లను చూడాల్సిందే.. ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి!
- Champions Trophy: ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తాచాటేందుకు కుర్రాళ్లు సిద్ధమయ్యారు. ఈ ఐసీసీ ఈవెంట్లో తమ ముద్ర వేసేందుకు సై అంటున్నారు. ఈ టోర్నీలో చూడాల్సిన యువ ఆటగాళ్ల లిస్ట్ పై ఓ లుక్కేయండి.
- Champions Trophy: ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తాచాటేందుకు కుర్రాళ్లు సిద్ధమయ్యారు. ఈ ఐసీసీ ఈవెంట్లో తమ ముద్ర వేసేందుకు సై అంటున్నారు. ఈ టోర్నీలో చూడాల్సిన యువ ఆటగాళ్ల లిస్ట్ పై ఓ లుక్కేయండి.
(1 / 5)
ప్రపంచ నంబర్ వన్ వన్డే బ్యాటర్ శుభ్ మన్ గిల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ భారత యువ ఓపెనర్ సంచలన ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్ తో సిరీస్ లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ శతకం బాదాడు. 25 ఏళ్ల గిల్ 50 వన్డేల్లో 60.16 సగటుతో 2587 పరుగులు చేశాడు. వన్డేల్లో 2500 పరుగులు పూర్తి చేసిన ఫాస్టెస్ట్ క్రికెటర్ గా ఇటీవల వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.
(Surjeet Yadav)(2 / 5)
పాకిస్థాన్ యంగ్ పేసర్ నసీం షా తన స్పీడ్ బౌలింగ్ తో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. 22 ఏళ్ల నసీం 23 వన్డేల్లో 22.71 సగటుతో 45 వికెట్లు పడగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో మ్యాచ్ లోనూ ఆకట్టుకున్నాడు.
(REUTERS)(3 / 5)
యంగ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర తక్కువ కాలంలోనే న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్లలో ఒకడిగా ఎదిగాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో 64.22 సగటుతో 578 పరుగులు చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్ తో మధ్య ఓవర్లలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 25 ఏళ్ల రచిన్ 29 వన్డేల్లో 970 పరుగులు, 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గాయంతో పాకిస్థాన్ తో మ్యాచ్ కు దూరమైన రచిన్ త్వరగా కోలుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది.
(AFP)(4 / 5)
ఇంగ్లండ్ యంగ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో చూడదగ్గ ఆటగాళ్లలో ఒకడు. 25 ఏళ్ల హ్యారీ టెస్టుల్లో సంచలన ఫామ్ ను వన్డేల్లోనూ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. 23 వన్డేల్లో 769 పరుగులు చేసిన అతను ఇంగ్లండ్ కు కీలకమయ్యే అవకాశముంది.
(x/SATISHMISH78)(5 / 5)
గత కొంతకాలంగా పెద్ద జట్లకు షాకిస్తూ సాగుతోంది అఫ్గనిస్థాన్. ఆ జట్టు విజయాల్లో 20 ఏళ్ల లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో ఆకట్టుకున్న అతను ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తాచాటే అవకాశముంది. 10 వన్డేలే (9 వికెట్లు) ఆడిన అతనిపై మంచి అంచనాలే ఉన్నాయి.
(x/ACBofficials)ఇతర గ్యాలరీలు