తెలుగు న్యూస్ / ఫోటో /
New Year Trip: జనవరిలో చూడదగిన ప్రదేశాల గురించి వెతుకుతున్నారా? ఈ చోట్లకి వెళ్లారంటే అక్కడే ఉండిపోతే బాగుండు అనుకుంటారు!
- New Year Trip: కొత్త సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వచ్చే ఏడాది మొదటి నెలను గుర్తుండిపోయేలా చేయాలనుకుంటే ట్రిప్ ప్లాన్ చేసుకోండి. మంచు ప్రాంతాలను ఇష్టపడేవారైతే మీ కోసం కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. 2025 జనవరిలో ఏయే ప్రాంతాల్లో మంచు కురుస్తుందో ఇక్కడ తెలుసుకోవచ్చు.
- New Year Trip: కొత్త సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వచ్చే ఏడాది మొదటి నెలను గుర్తుండిపోయేలా చేయాలనుకుంటే ట్రిప్ ప్లాన్ చేసుకోండి. మంచు ప్రాంతాలను ఇష్టపడేవారైతే మీ కోసం కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. 2025 జనవరిలో ఏయే ప్రాంతాల్లో మంచు కురుస్తుందో ఇక్కడ తెలుసుకోవచ్చు.
(1 / 7)
జనవరి మాసం మంచు కురిసే సమయం అంటారు. పైగా కొత్త సంవత్సరం కూడా. ఇలాంటి మంచి సందర్భాలను ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. మీకూ మంచు ప్రదేశాలకు వెళ్లడం చాలా ఇష్టమైతే.. ఈ న్యూఇయర్ కి మొదటి నెలను గుర్తిండిపోయేలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీకోసం మేము కొన్ని ప్రదేశాలను లిస్ట్ చేసాం. 2025 జనవరిలో మంచుతో కప్పి ఉండేవి, చూడదగిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి.
(2 / 7)
మనాలీ: జనవరిలో నెలలో మనాలీలో మంచు బాగా కురుస్తుంది. వాతావరణం చల్లగా మారి అడ్వెంచర్ ప్రదేశంగా మారుతుంది. ఈ సమయంలో ఈ ప్రాంతంలో స్నో గేమ్స్, స్కీయింగ్, స్నో బైకింగ్, ట్రెక్కింగ్, ర్యాఫ్టింగ్, బైకింగ్ వంటివి వాటిని ఎంజాయ్ చేయచ్చు. మంచుతో కప్పి ఉన్న కొండలు, ఆకాశంలో నీలి రంగులు, సూర్యోదయం కలిపిన అద్భుతమైన దృశ్యాలను ఇక్కడ మీరు చూడచ్చు.
(3 / 7)
సిమ్లా: సిమ్లా ప్రదేశం అంతా జనవరిలో మంచుతో కప్పబడి చాలా ఆకర్షిణీయంగా మారుతుంది. మంచు కొండలు, మంచుతో కప్పిన రహదారులు, మంచు కొండలు పర్యాటలకును చాలా ఆకట్టుకుంటాయి. ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించాలి అనుకునే వారికి ఇది చక్కటి ప్రదేశం.
(4 / 7)
మెక్లియోడ్ గంజ్: హిమాచల్ ప్రదేశ్ దగ్గరున్నఅద్భుతమైన పర్యాటక ప్రాంతాల్లో మెక్లియోడ్ గంజ్ ఒకటి. జనవరి మాసంలో ఈ ప్రాంతం అంతా చల్లగా, మంచుతో కప్పి ఉండే చోటుగా మారుతుంది. ఎటూ చూస్తున్నా ముక్కోణపు మంచు దృశ్యాలు, మంచుతో కప్పబడిన కొండలు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
(5 / 7)
ఔలీ: ఉత్తరాఖండ్ లోని జోషీమఠ్ దగ్గర ఉన్న ఒక పర్వత ప్రాంతం.జనవరిలో ఈ ప్రదేశం శీతాకాల పర్యాటక గమ్యం గా మారిపోతుంది.మంచు కురవడం ఈ ప్రాంతపు ప్రత్యేక ఆకర్షణ.స్కీయింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్, మంచులో ఫన్ అనుభవించడానికి ఉత్తమ సమయం. ఔలీలోని స్కీయింగ్ రిసార్ట్ ప్రపంచం లోని ఉత్తమ రిసార్టులలో ఒకటి.
(6 / 7)
చోప్తా: భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్ ప్రదేశం చోప్తా. ఇది సముద్ర మట్టానికి 2,680 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టూ గంభీరమైన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. జనవరి మాసంలో చుట్టూ మంచుతో కప్పి ఉండే రహదారులతో ఆకర్షణీయమైన ప్రదేశంగా మారుతుంది. పచ్చని అడవులు, మంచుతో కప్పబడిన శిఖరాలకు పర్యటకులను కట్టిపడేస్తాయి.
(7 / 7)
షోజా: హిమాచల్ ప్రదేశ్ లోని సిరాజ్ లోయలో వున్న అందమైన ప్రాంతం షోజా. జలోరీ పాస్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో వుండే షోజా సముద్ర మట్టానికి 2368 మీటర్ల ఎత్తున వుంటుంది. జనవరిలో ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడిన హిమాలయాల అందమైన దృశ్యాల్ని అందిస్తుంది.సేరోల్సార్ సరస్సు, రఘుపూర్ కోట, జలపాత కేంద్రం, జలోరీ పాస్, తీర్థాన్ లోయ ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలు.
ఇతర గ్యాలరీలు