నెమళి ఈకలతో ఇలా చేశారంటే శత్రువు ఎవరైనా మీ ముందు ఓడిపోవాల్సిందే!-placing a peacock feather at home to remove vastu defects a belief and the things behind it ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నెమళి ఈకలతో ఇలా చేశారంటే శత్రువు ఎవరైనా మీ ముందు ఓడిపోవాల్సిందే!

నెమళి ఈకలతో ఇలా చేశారంటే శత్రువు ఎవరైనా మీ ముందు ఓడిపోవాల్సిందే!

Published Apr 28, 2025 08:42 AM IST Ramya Sri Marka
Published Apr 28, 2025 08:42 AM IST

అందమైన నెమలి ఈక కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగానూ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. వాస్తు, ఆర్థిక సమస్యల నుంచి శత్రువుల బాధలు తొలగించడం వరకూ నెమలి ఈక శక్తివంతమైన సాధనమని చాలామంది విశ్వసిస్తారు. ఈ నమ్మకం ప్రకారం నెమలి ఈకను ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడ ఉంచాలో తెలుసుకుందాం రండి.

భారతీయ సంస్కృతిలో నెమలి ఈకకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది అందానికి, ఆధ్యాత్మికతకు, రక్షణకు చిహ్నంగా పరిగణించబడుతుంది. శ్రీకృష్ణుడి కిరీటాన్ని అలంకరించే ఈ దివ్యమైన ఈక ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించడమే కాకుండా, శత్రువుల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది. మీరు శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే, నెమలి ఈక ఒక శక్తివంతమైన పరిష్కారంగా పనిచేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీన్ని ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉంచాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

(1 / 7)

నెమలి ఈకలను ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుందని, ఇది శత్రువుల ప్రతికూల ఆలోచనలను నిరోధిస్తుందని కొందరు నమ్ముతారు. వీటిని గోడకు లేదా ప్రత్యేకంగా ఒక స్టాండ్‌లో కూడా అలంకారించి ఉంచచ్చు.

(2 / 7)

ఒక నెమలి ఈకను మీతో ఎప్పుడూ ఉంచుకోవడం అంటే పర్సులో లేదా హ్యాండ్ బ్యాగులో లేదా రాత్రిపూట పడుకునేటప్పుడు మీ దిండు కింద పెట్టుకోవడం వల్ల శత్రువుల భయాలు, ఆందోళనలు తగ్గుతాయని హిందువుల విశ్వాసం.

(3 / 7)

నెమలి ఈకలను మీ ఇంటి పూజా స్థలంలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని, శత్రువుల దుష్ట ప్రభావం నుండి రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు.

(4 / 7)

చిన్న పిల్లలకు లేదా పెద్దవారికి దృష్టి దోషం తగిలిందని భావిస్తే, మూడు నెమలి ఈకలను సవ్య దిశలో తిప్పి వారి చుట్టూ ఊదడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుందని నమ్మిక.

(5 / 7)

(Freepik)

శత్రువుల బాధలు తట్టుకోలేనప్పుడు ఒక  నెమలి ఈకను తీసుకుని దాని మీద సింధూరం(హనుమంతుడికి రాశే బొట్టు)తో శత్రువు పేరు రాశి మీ పూజా మందిరంలో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం, ఈ నెమలి ఈకను ప్రవహించే నీటిలో వదిలివేయండి. మంగళవారం లేదా శనివారం రాత్రి ఈ ట్రిక్ చేయండి.  ఇలా చేయడం వల్ల శత్రువుల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

(6 / 7)

గమనిక: ఈ సమాచారం శాస్త్రాలు, విశ్వాసాలతో పాటు సాధారణ జ్ఞానంతో అందించినది మాత్రమే. వీటిని ఖచ్ఛితమైన ఆధారాలు ఉండవు.వీటిని పాటించడం పూర్తిగా మీ నమ్మకాలు, ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం గురించిన ఖచ్చితమైన సమాచారం కోసం సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.

(7 / 7)

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు