(1 / 8)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కోతకు గురైన ఉప్పాడ తీరం పరిశీలించేందుకు వెళ్తోన్న పవన్ కల్యాణ్.. మార్గమధ్యలో ఒక బాలుడు జనసేన జెండా పట్టుకుని నిలబడటం చూసి, కాన్వాయ్ ఆపారు. ప్రేమతో ఆ బాలుడును హత్తుకున్నారు. దీంతో ఆ బాలుడి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
(2 / 8)
పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు.కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్ లు పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
(3 / 8)
ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మారిటైం బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వశాఖ అధికారులతో కలసి తీర ప్రాంత గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, సమస్యకు శాస్త్రీయ పరిష్కారం వెతకాలని అధికారులను పవన్ ఆదేశించారు.
(4 / 8)
పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవెర్చే పనిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యచరణకు దిగారు.
(5 / 8)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం ఉప్పాడ తీరంతో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారీ టైమ్ బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వ శాఖ(ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ) అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణను అడిగి తెలుసుకున్నారు.
(6 / 8)
ఉప్పాడ తీర ప్రాంత కోత సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులతో కలసి అధ్యయనానికి వచ్చిన పవన్ కల్యాణ్ కు ఉప్పాడ గ్రామ ప్రజలు, తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు.
(7 / 8)
మత్స్యకార మహిళలు పవన్ పై పూల వర్షం కురిపించి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
(8 / 8)
ఉప్పాడ తీరంలో బోటులో జనసైనికులు
ఇతర గ్యాలరీలు