Pawan Kalyan : చులకనగా చూస్తామంటే, ఉపముఖ్యమంత్రి పదవి పోయినా పర్వలేదు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు-pithapuram deputy cm pawan kalyan sensational comments on ysrcp leaders police behavior ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Kalyan : చులకనగా చూస్తామంటే, ఉపముఖ్యమంత్రి పదవి పోయినా పర్వలేదు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan : చులకనగా చూస్తామంటే, ఉపముఖ్యమంత్రి పదవి పోయినా పర్వలేదు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Updated Nov 04, 2024 06:02 PM IST Bandaru Satyaprasad
Updated Nov 04, 2024 06:02 PM IST

Pawan Kalyan:ఇంట్లోకి వచ్చి నీ భార్య, బిడ్డలని రేప్ చేస్తామని చెప్తే దాన్ని వైసీపీ నేతలు భావ ప్రకటన అంటున్నారని, ఇలా మాట్లాడితే చిన్న పిల్లల మీద రేప్ లు చెయ్యరా? అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఉన్నటుగా వ్యవహరిస్తామని అంటే జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండండని హెచ్చరించారు.

పిఠాపురం నియోజకవర్గంలో పర్యటింంచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...తాజాగా రాజకీయ పరిస్థితులు, పోలీసుల తీరుపై మాట్లాడారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, ఇతర దారుణాలపై ఫైర్ అయ్యారు.  వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తానెప్పుడూ పాలసీల పరంగా విమర్శించానని,  వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. వైసీపీ నేతలు కూడా అలానే అంటారని ఆశిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటుగా వ్యవహరిస్తామని అంటే జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండండని హెచ్చరించారు.  

(1 / 7)

'సమ రాజ్య పాలనలో ఒకరు వచ్చి ఇంకొకరిపై విమర్శలు చేస్తాం, చులకనగా చూస్తాం అంటే తన ఉపముఖ్యమంత్రి పదవి పోయినా పర్వాలేదు, కానీ ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధం' అని పవన్ కల్యాణ్ అన్నారు.  

(2 / 7)

ఇది స్థిరమైన ప్రభుత్వం, వ్యక్తులు చేసే తప్పులపై చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కూటమిని ఎవరు చెడగొట్టలేరు, వ్యక్తులు వచ్చి ఎవరికి వారు  సొంత పెత్తనం చేసుకుని గేమ్స్ ఆడితే మమ్మల్ని ఏం చేయలేరన్నారు. తాను, సీఎం చంద్రబాబు చాలా క్లారిటీగా ఉన్నామన్నారు. ఈ పొత్తు స్థిరమైనది, కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు మమ్మల్ని ఏం చేయలేవన్నారు. వ్యక్తులు చేసే తప్పులను కులానికి ఆపాదించకండని సూచించారు.  

(3 / 7)

రాజకీయంగా వ్యతిరేకంగా మాట్లాడితే... ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇంట్లో ఆడ బిడ్డలను, ఆడవారిని, తల్లులను దూషిస్తారా? రేప్ చేస్తాం అని మాట్లాడుతారా? వారిపై పోలీసులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనితను కోరారు. 

(4 / 7)

ఇష్టమొచ్చినట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకోరా? ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా? మీరు బాధ్యతగా వ్యవహరించండి, బలంగా పనిచేసి చట్టపరంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇంట్లోకి వచ్చి నీ భార్య, బిడ్డలని రేప్ చేస్తామని చెప్తే దాన్ని వైసీపీ నేతలు భావ ప్రకటన అంటున్నారని, ఇలా మాట్లాడితే చిన్న పిల్లల మీద రేప్ లు చెయ్యరా? అని ప్రశ్నించారు. 

(5 / 7)

అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తాను పోలీసులకు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొమ్మని మాట్లాడుతుంటే, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పోలీసు అధికారులు ఉద్యోగ ధర్మం మరచి మీనా మేషాలు లెక్కపెడుతున్నారని మండిపడ్డారు. ఇంకా పాత పద్ధతులు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వ్యక్తిని అరెస్టు చేయడానికి కులం ఎందుకు అడ్డొస్తుందన్నారు.  

(6 / 7)

ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు సాంఘిక సంక్షేమం హాస్టల్స్ పరిశీలించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. జనసైనికులు, వీర మహిళలు బాధ్యత అయిపోలేదని, ప్రజల్లో ఉండాలని సూచించారు. జనసేన ఓడిపోయిన సమయంలో ప్రజలు అండగా నిలబడ్డారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. చిన్నపాటి కూలీ చేసుకునే వ్యక్తి హైద్రాబాద్ నుంచి వచ్చి ఓటు వేసి మనల్ని గెలిపించారన్నారు. విదేశాల నుంచి వచ్చి కూటమి కోసం పనిచేశారన్నారు. వారికి జవాబుదారీగా ఉండాలన్నారు. 

(7 / 7)

ఇతర గ్యాలరీలు