(1 / 6)
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందించారు.
(2 / 6)
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... జీతం తీసుకుని పనిచేద్దామని ముందు నిర్ణయించుకున్నానని, కానీ పంచాయతీ రాజ్ సహా వివిధ శాఖల ఆర్థిక పరిస్థితి చూసి మనసు మార్చుకున్నానని పవన్ అన్నారు. వివిధ శాఖల లెక్కలు తీసే కొద్దీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థమై జీతం వద్దని చెప్పానన్నారు. జీతం తీసుకుని పని చేద్దామనుకున్నా ఇక్కడ పరిస్థితి చూశాక తీసుకోవాలనిపించట్లేదన్నారు.
(3 / 6)
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే రూ.600 కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిర్మించాల్సిన అవసరం ఏముందని డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించారు. నా క్యాంప్ ఆఫీస్ లో మరమ్మతులు చేస్తామని, కొత్త ఫర్నిచర్ తీసుకొస్తామని చెప్తే ఏమీ వద్దు అవసరమైతే నేనే తెచ్చుకుంటానని డబ్బులు వృథా చేయొద్దని చెప్పానన్నారు. పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూశాక తనకు ఖర్చు పెట్టాలనిపించలేదన్నారు.
(4 / 6)
ఇది కరప్షన్ గవర్నమెంట్ కాదు, కరెక్షన్ గవర్నమెంట్ అని పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తాం, సరైన పనులు అందిస్తామన్నారు.
(5 / 6)
పిఠాపురంలో సొంతిల్లు కట్టుకోవడానికి స్థలం చూస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. త్వరలోనే ఇక్కడ సొంతిల్లు నిర్మించుకుని నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. సీఎం చంద్రబాబు, తాను వ్యవస్థలను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. అందులో భాగంగానే పెన్షన్ పంపిణీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు.
(6 / 6)
తన 25 ఏళ్ల సినిమా వృత్తిలో దాదాపు 100 కోట్లకు పైగా టాక్స్ కట్టానని పవన్ కల్యాణ్ అన్నారు. కానీ తన ఆడిటర్ తో మొత్తం మీద గంటన్నర కంటే ఎక్కువ కూర్చోలేదన్నారు. కానీ మొన్న పంచాయతీరాజ్ శాఖ ఆడిట్ లెక్కల మీద ఒక్కో సెషన్ లో దాదాపు 4-5 గంటలకు కూర్చున్నానన్నారు. ఒక్కో సెషన్ లో రూ.3000 కోట్లు, రూ.4000 కోట్లు నిధులు మాయం అయ్యాయని తెలిసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎక్కడా డబ్బు మిగిల్చకుండా మాయం చేసిందన్నారు.
ఇతర గ్యాలరీలు