Mahakumbh Mela Stampede : ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన తర్వాత ఫొటోలు
- Mahakumbh Mela Stampede : ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన మహా కుంభమేళాలో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. దీంతో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. అమృత స్నానాలు రద్దు చేశారు.
- Mahakumbh Mela Stampede : ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన మహా కుంభమేళాలో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. దీంతో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. అమృత స్నానాలు రద్దు చేశారు.
(1 / 7)
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా అర్ధరాత్రి ఒంటిగంటకు తొక్కిసలాట జరిగింది. ఘాట్ వద్ద అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడంతో తొక్కిసలాట జరిగింది.
(HT Photo/Deepak Gupta)(2 / 7)
మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద అమృత స్నానానికి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అధికార యంత్రాంగం ధృవీకరించలేదు. ప్రమాదంలో గాయపడిన పలువురిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
(HT Photo/Deepak Gupta)(3 / 7)
రాత్రి సమయంలో అకస్మాత్తుగా జనం గుమిగూడడంతో పెద్ద దుమారం రేగడంతో తొక్కిసలాటకు దారితీసింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను అంబులెన్స్ ల సహాయంతో తరలించారు.
(HT Photo/Deepak Gupta)(4 / 7)
త్రివేణి సంగమం వద్ద భారీగా జనం గుమికూడడంతో భద్రతా సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయింది.
(HT Photo/Deepak Gupta)(5 / 7)
క్షతగాత్రులను మహాకుంభ్‌లోని కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియరాలేదు. తొక్కిసలాట తర్వాత క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
(HT Photo/Deepak Gupta)(6 / 7)
అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని స్నానాలు రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని, బసంత్ పంచమి నాడు స్నానాలు ఉంటాయని అన్నారు.
(PTI Photo)ఇతర గ్యాలరీలు