Tollywood Delegates Meet CM : సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ.. ఎవరెవరు వచ్చారు.. ఏం మాట్లాడారు, ఫోటోలు
- Tollywood Delegates Meet CM : సీఎం రేవంత్‌తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. నాగార్జున, వెంకటేష్, సి.కల్యాణ్, నాగవంశీ, అల్లు అరవింద్, గోపీ ఆచంట, ప్రసాద్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ తదితరులు ఉన్నారు.
- Tollywood Delegates Meet CM : సీఎం రేవంత్‌తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. నాగార్జున, వెంకటేష్, సి.కల్యాణ్, నాగవంశీ, అల్లు అరవింద్, గోపీ ఆచంట, ప్రసాద్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ తదితరులు ఉన్నారు.
(1 / 6)
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ అయ్యారు. రెండు గంటల పాటు సమావేశం సాగింది. సినీ ప్రముఖులకు తమ వైఖరిని ప్రభుత్వం స్పష్టం చేసింది. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
(2 / 6)
యూనివర్సల్ లెవల్‌లో స్టూడియో సెటప్ ఉండాలని.. హీరో అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే పరిశ్రమ ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావలన్నది తమ కోరిక అని నాగార్జున స్పష్టం చేశారు.
(3 / 6)
ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని దగ్గుబాటి సురేష్‌బాబు, వెంకటేష్ చెప్పారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది తమ డ్రీమ్ అని వివరించారు. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చిందన్నారు.
(4 / 6)
శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్నారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని చెప్పారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలన్నారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని కోరారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని.. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
(5 / 6)
తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి తమకు కొన్ని విషయాల్లో దిశా నిర్దేశం చేశారని చెప్పారు. ఇటీవలి కాలంలో పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరిగిందని, అదంతా కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అవుతామన్నారు.
(6 / 6)
సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. నిర్మాతల నుంచి.. దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవి శంకర్, విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, రవి కిషోర్, కె ఎల్ నారాయణ, భోగవల్లి ప్రసాద్ ఉన్నారు. హీరోల నుంచి వెంకటేష్, నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం వరుణ్ తేజ్, శివ బాలాజీ వచ్చారు. దర్శకుల తరఫున వీర శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి సాయి రాజేష్, వశిష్ట, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ వచ్చారు.
ఇతర గ్యాలరీలు