PhonePe New features: ఫోన్ పే కొత్త ఫీచర్లు.. విదేశాల్లో డబ్బు చెల్లించవచ్చు
- PhonePe New features: ఫోన్‌పేలో 'యూపీఐ ఇంటర్నేషనల్' ఫీచర్ ద్వారా యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్‌లోని వ్యాపారులకు చెల్లింపులు చేయవచ్చు. స్థానిక QR కోడ్‌ని ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. మీరు భారతదేశంలో చెల్లించే విధంగానే ఈ చెల్లింపులు చేయొచ్చు.

(1 / 6)
ఒక భారతీయుడు విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్లాడనుకుందాం. అతను అక్కడి షాపుల్లో ఫోన్‌పేతో చెల్లించవచ్చు. PhonePe అటువంటి ఫీచర్ తెచ్చింది. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఫీచర్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.
(PhonePe)(2 / 6)
ప్రస్తుతం 'UPI ఇంటర్నేషనల్' ద్వారా యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్‌లలోని వ్యాపారులకు చెల్లింపులు చేయవచ్చు. స్థానిక QR కోడ్‌ని ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు.
(PhonePe )(3 / 6)
వినియోగదారులు వారి భారతీయ బ్యాంకు ఖాతాల నుండి నేరుగా విదేశీ కరెన్సీ చెల్లింపులు చేయవచ్చు. అంతర్జాతీయ డెబిట్ కార్డ్‌తో చెల్లించడంలాగే ఇది కూడా.
(PhonePe)(4 / 6)
వినియోగదారులు ఫోన్‌పే యాప్ ద్వారానే తమ UPI-లింక్డ్ బ్యాంక్ ఖాతాలలో సేవను ఎనేబుల్ చేయవచ్చు. ఇందుకు వారి UPI పిన్‌ను ఎంటర్ చేయాలి.
(PhonePe)(5 / 6)
విదేశాల్లో కొనుగోళ్లు చేసేందుకు భారతీయులు ఆ దేశ కరెన్సీ, క్రెడిట్ కార్డ్ లేదా ఫారెక్స్ కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. PhonePe ఫీచర్‌తో వారు ఇప్పుడు UPIని ఉపయోగించి చెల్లింపులు చేయడానికి వారి భారతీయ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించవచ్చు.
(PhonePe)ఇతర గ్యాలరీలు