
(1 / 8)
మీరు కొత్త ఫోన్ తీసుకున్నారా? పాత ఫోన్‌ను రన్ చేస్తున్నారా? బ్యాటరీని పదే పదే ఛార్జ్ చేయాల్సి వస్తే ఏదో లోపం ఉందని అర్థం. మీరు అనుకోకుండా కొన్ని తప్పులు చేస్తూ మీ ఫోన్ బ్యాటరీ లైఫ్, పనితీరును దెబ్బతీస్తున్నారు. అవేంటో చూద్దాం..

(2 / 8)
బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంచడం : మీ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటే.. అది మీ బ్యాటరీకి అతిపెద్ద శత్రువు. ఆటో బ్రైట్నెస్ ఆన్‌లో ఉంచండి లేదా ఇంటి లోపల మాన్యువల్ బ్రైట్‌నెస్ 30-40 శాతం వద్ద ఉంచండి.

(3 / 8)
బ్యాక్ గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేయకపోవడం : చాలా యాప్స్ బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. (ఉదా. మ్యాప్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మొదలైనవి). ఇవి బ్యాటరీని వినియోగిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ఆఫ్ చేయండి. అన్ని యాప్‌లను క్లియర్ చేయండి.

(4 / 8)
లొకేషన్, వై-ఫై, బ్లూటూత్ : కొన్ని ఫీచర్లు అవసరం లేకపోయినా ఆన్‌లో ఉంటాయి. ఇది బ్యాటరీని ప్రభావితం చేస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే జీపీఎస్, బ్లూటూత్, వైఫై ఆన్ చేయాలి. అలాగే బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు, బ్యాటరీ సేవర్ మోడ్‌ని ఆన్‌లో ఉంచండి.

(5 / 8)
నెట్ వర్క్ సమస్య : సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు ఫోన్ నెట్ వర్క్‌ను పట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తుంది. బ్యాటరీ ఎక్కువ వినియోగిస్తుంది. నెట్ వర్క్ చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఎయిర్ ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం చాలా ముఖ్యం. అలాగే ఇంట్లో లేదా కార్యాలయంలో వై-ఫై కాలింగ్ ఉపయోగించండి.

(6 / 8)
ఓవర్ ఛార్జింగ్ : ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచడం లేదా పదేపదే 100 శాతం ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. ఫోన్‌ను 20 నుంచి 80 శాతం మధ్య ఛార్జ్ చేస్తే బాగుంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువగా వాడకూడదు.

(7 / 8)
ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే వాడకం : ఫోన్‌లో ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ లేదా లైవ్ వాల్ పేపర్ ఆన్ చేస్తే, అది చాలా బ్యాటరీని ఉపయోగిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి రిఫ్రెష్ రేట్‌ను 60 హెర్ట్జ్ కు సెట్ చేసి స్టాటిక్ వాల్ పేపర్ ఉపయోగించండి.

(8 / 8)
అనవసరమైన నోటిఫికేషన్లు, వైబ్రేషన్స్ : ప్రతి యాప్ నోటిఫికేషన్లు, ప్రతిసారీ ఫోన్ వైబ్రేట్ చేయడం వల్ల మీ బ్యాటరీ నెమ్మదిగా ఖాళీ అవుతుంది. అనవసరమైన యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేసి, ముఖ్యమైనవాటి కోసం మాత్రమే వైబ్రేషన్ మోడ్‌ను ఆన్‌లో పెట్టండి.
ఇతర గ్యాలరీలు