Perupalem Beach: వికెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే పేరుపాలెం వెళ్లండి.. సూపర్ ప్లేస్-perupalem beach is a good place to enjoy the weekend with family and friends ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Perupalem Beach: వికెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే పేరుపాలెం వెళ్లండి.. సూపర్ ప్లేస్

Perupalem Beach: వికెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే పేరుపాలెం వెళ్లండి.. సూపర్ ప్లేస్

Published Aug 22, 2024 03:08 PM IST Basani Shiva Kumar
Published Aug 22, 2024 03:08 PM IST

  • Perupalem Beach: ఏపీలో సముద్ర తీరం ఎక్కువ. కానీ.. మంచి బీచ్‌లు కొన్నే ఉన్నాయి. వాటిలో బాగుండేది పేరుపాలెం బీచ్. వీకెండ్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలంటే పేరుపాలెం బీచ్‌కు వెళ్లడం ఉత్తమం. ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.

వీకెండ్, సెలవుల్లో ఎంజాయ్ చేయాలంటే.. అందుకు ఫర్‌ఫెక్ట్ ప్లేస్ పేరుపాలెం బీచ్. కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు సరదాగా గడపడానికి ఈ బీచ్ అనుకూలంగా ఉంటుంది. ప్రైవసీ ఉంటుంది. నిత్యం పోలీసుల పర్యవేక్షణ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

(1 / 6)

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ బీచ్‌ల్లో పేరుపాలెం ఒకటి. అందుకే ఈ బీచ్ నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ సముద్రతీరం పరిశుభ్రంగా ఉంటుంది. అలల తాకిడి ఎక్కువగా ఉండదు. సముద్రపు నీరు కూడా తేటగా ఉంటుంది. ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు.

(2 / 6)

ఈ బీచ్‌కు చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రముఖ పట్టణాలు పేరుపాలెం బీచ్‌కు దగ్గర్లోనే ఉంటాయి. నరసాపురం పట్టణం నుంచి పేరుపాలెం బీచ్ కేవలం 14 కిలోమీటర్లే. ట్రైన్ ద్వారా నరసాపురం చేరుకొని అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో పేరుపాలెం బీచ్‌కు చేరుకోవచ్చు. 

(3 / 6)

పేరుపాలెం బీచ్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బీచ్‌ పక్కనే కొబ్బరి తోటలు ఉంటాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ కొబ్బరి తోటల్లోనే వంట చేసుకొని భోజనం చేస్తారు. శుభ్రంగా ఉంటే ఆ తోటల యజమానులు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పరు. 

(4 / 6)

భీమవరం నుంచి పేరుపాలెం బీచ్ 28 కిలోమీటర్లు ఉంటుంది. భీమవరం వరకు ట్రైన్‌లో, బస్సుల్లో వచ్చినా.. పేరుపాలెం బీచ్‌కు 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి 96 కిలోమీటర్లు, విజయవాడ నుంచి పేరుపాలెం బీచ్‌కు 142 కిలోమీటర్లు ఉంటుంది. కార్లు, ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవారు భీమవరం, నరసాపురం మీదుగా వస్తే.. తొందరగా చేరుకోవచ్చు. 

(5 / 6)

ఈ ప్రాంతంలో ఒక రోజు కంటే ఎక్కువ ఉండాలంటే.. హోటళ్లు, రిసార్ట్స్ కూడా అందుబాటులోనే ఉంటాయి. నరసాపురం, భీమవరం పట్టణాల్లో ప్రైవేట్ హోటళ్లలో ఉండొచ్చు. నరసాపురం పట్టణంలో గోదావరి తీరాన ఉన్న హోటళ్లలో ఉంటే వాతావరణం బాగుంటుంది. ప్రశాంతంగా ఉండొచ్చు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు