Telugu Movies on OTT: ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ఇవే - ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ స్పెషల్
ఈ వారం క్రైమ్ థ్రిల్లర్‌తో ఫాటు ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన సినిమాలు డిఫరెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?
(1 / 4)
కాజల్ సత్యభామ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా గురువారం నుంచి ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. ఓ యువతి మర్డర్ వెనకున్న మిస్టరీని ఛేదించే క్రమంలో ఓ లేడీ పోలీస్ ఆఫీసర్‌కు ఎదురైన పరిణామాల చుట్టూ ఈ మూవీ సాగనుంది.
(2 / 4)
పాయల్ రాజ్‌పుత్ రక్షణ మూవీ ఆగస్ట్ 2 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. జీవితంలో ఉన్న స్థితిలో ఉన్న అమ్మాయిలను ఓ సైకో ఎలా హతమార్చుతున్నాడు? ఈ సీరియల్ కిల్లర్‌ను పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకుంది అన్నదే ఈ మూవీ కథ.
(3 / 4)
డియర్ నాన్న మూవీ గత నెలలో ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలోనూ రిలీజైంది. ఈ మూవీలో చైతన్యరావు, సూర్య కీలక పాత్రలు పోషించారు.
ఇతర గ్యాలరీలు