Payal Kapadia: చరిత్ర సృష్టించిన డైరెక్టర్ పాయల్ కపాడియా.. ప్రశంసించిన ప్రధాని మోదీ
- Payal Kapadia: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024లో గ్రాండ్స్ ప్రిక్స్ అవార్డు కైవసం చేసుకున్నారు భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా. దీంతో ఓ చరిత్ర సృష్టించారు.
- Payal Kapadia: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024లో గ్రాండ్స్ ప్రిక్స్ అవార్డు కైవసం చేసుకున్నారు భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా. దీంతో ఓ చరిత్ర సృష్టించారు.
(1 / 5)
డైరెక్టర్ పాయల్ కపాడియా చరిత్ర సృష్టించారు. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును ఆమె కైవసం చేసుకున్నారు. దీంతో కేన్స్‌లో గ్రాండ్ ప్రిక్స్ పురస్కారం దక్కించుకున్న తొలి భారత ఫిల్మ్ మేకర్‌గా పాయల్ కపాడియా హిస్టరీ క్రియేట్ చేశారు.
(2 / 5)
‘ఆల్ వీ ఇమాజిన్ ఆస్ లైట్’ డాక్యుమెంటరీ సినిమాకు గాను పాయల్ కపాడియా.. ఈ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు కైవసం చేసుకున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ కేన్స్ వేడుకలో శనివారం ఈ అవార్డును ఆమె అందుకున్నారు.
(3 / 5)
తనకు అవార్డు తెచ్చిన పెట్టిన చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన కానీ కస్తూరి, దివ్యప్రభ, చాయా కదమ్‍ను పాయల్ కపాడియా కౌగిలించుకున్నారు. సంతోషాన్ని వారితో పంచుకున్నారు.
(4 / 5)
కేన్స్ ప్రధానమైన కాంపిటిషన్‍లో 30 ఏళ్ల తర్వాత ప్రదర్శితమైన భారతీయ చిత్రంగానూ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ ఏస్ లైట్’ నిలిచింది. చివరగా ఈ ఈవెంట్ ప్రధానమైన పోటీలో ప్రదర్శితమైన భారతీయ మూవీగా స్వహమ్ (1994) ఉంది.
ఇతర గ్యాలరీలు