PawanKalyan: కోలుకున్న పవన్ కళ్యాణ్, కేరళ, తమిళనాడుల్లో పుణ్య క్షేత్రాల సందర్శనకు శ్రీకారం
- PawanKalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోలుకున్నారు. బుధవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి శ్రీకారం చుట్టారు. ఆలయాల సందర్శన కోసం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు.కొచ్చిలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు.

(1 / 8)
పుణ్య క్షేత్రాల సందర్శనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొచ్చి విమానాశ్రయం చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతో ఉన్నారు.
(3 / 8)
పవన్ కళ్యాణ్ గత వారం, పదిరోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తీవ్ర అస్వస్థతతో ఉన్నారని ప్రకటన విడుదల చేశారు. స్పాండలైటిస్ కారణంగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు జనసేన వర్గాలు తెలిపాయి.
(4 / 8)
మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. పవన్‌తో మాట్లాడేందుకు తాను కూడా ప్రయత్నించినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు.
(5 / 8)
గత వారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. పవన్ రాకపోవడంపై అప్పట్లో జనసేన తీవ్ర జ్వరం, స్పాండలైటిస్ సమస్యతో బాధపడుతున్నారని వివరణ ఇచ్చింది.
(6 / 8)
మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి డిప్యూటీ సీఎం రాకపోవడంతో పలు ఊహాగానాలు చెలరేగాయి. పవన్ కళ్యాణ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా, ఆయన అందుబాటులోకి లేరని సీఎం చంద్రబాబు సమావేశంలో వివరించారు.
(7 / 8)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడిని క్యాబినెట్‌లోకి తీసుకుంటారని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో పవన్ ఉన్నారు. మరో కీలకమైన స్థానంలో ఉన్న నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఇతర గ్యాలరీలు