AP Republic Day Celebration : విజయవాడలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా పవన్, లోకేష్
- AP Republic Day Celebration : ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలో నిర్వహించిన వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
- AP Republic Day Celebration : ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలో నిర్వహించిన వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
(1 / 7)
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
(2 / 7)
రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
(3 / 7)
రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసినట్లు వ్యాఖ్యానించారు.
(4 / 7)
భారత పౌరులందరినీ ఒకే ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి మహామహులు రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభవేళను స్మరించుకుంటూ.. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పారు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు.
(5 / 7)
ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు మంత్రి లోకేష్. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైన రోజు ఇది అని ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమాహారం కాదని.. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలు మూలస్తంభాలుగా అన్ని విధాల ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయం అని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగానికి పునాది అని.. ప్రతీఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పోస్టు చేశారు.
(6 / 7)
గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జలవనరుల శాఖ, అటవీ శాఖ, రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖ శకటాల ప్రదర్శన జరిగింది. దీన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు.
ఇతర గ్యాలరీలు