(1 / 7)
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ ఘనంగా జరిగింది. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ నేతృత్వంలో ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
(2 / 7)
ఎలాంటి ప్రచార హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్ ట్రస్ట్‌కున్న ప్రత్యేకత అని పవన్ కల్యాణ్ కొనియాడారు. మరో వందేళ్ల పాటు ఈ ట్రస్ట్ కొనసాగాలని ఆకాంక్షించారు. నారా భువనేశ్వరి అంటే తనకు అపారమైన గౌరవం అని.. ఎన్ని కష్టాలు ఎదురైనా బలమైన సంకల్పంతో నిలబడడం ఆమె దగ్గర చూశానని చెప్పారు.
(3 / 7)
ఎన్టీఆర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే ఎన్టీఆర్ ట్రస్ట్‌ను.. అభినందిస్తున్నట్టు చెప్పారు. తలసేమియా బాధితులకు అండగా మ్యూజికల్ నిర్వహణ మంచి నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. మంచి కార్యక్రమాలకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఎన్టీఆర్ లాగే నారా భువనేశ్వరి కూడా మొండిఘటం అని చంద్రబాబు కార్యక్రమంలో నవ్వులు పూయించారు.
(4 / 7)
ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వు.. అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు. విస్తృతమైన సేవలతో ప్రజల మనసులను గెలిచిన ట్రస్ట్ అని కొనియాడారు. అనాధలు, ఆపన్నులకు ఉచిత వసతితో కూడిన విద్య అభినందనీయమని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలోనే బ్లడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.
(5 / 7)
ఫ్యాక్షన్ హింసకు గురైన అనేక కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశాజ్యోతిగా నిలిచిందని లోకష్ చెప్పారు. వారికి విద్య, ఆర్థిక మద్దతును అందిస్తోందన్నారు. తన పాదయాత్రలో.. చాలా మంది చిన్న పిల్లల జీవితాలను ట్రస్ట్ ఎలా మార్చేసిందో ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.
(6 / 7)
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి బాధితులను ఆదుకోవడాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ సవాలుగా స్వీకరించిందని.. లోకేష్ వివరించారు. క్లిష్టమైన సమయంలో అవసరమైన వారికి అండగా నిలచిందన్నారు. మాస్క్‌లు, మందులు, ఆక్సిజన్‌ను పంపిణీ చేశామని.. కోవిడ్ బాధితుల ప్రాణాలను రక్షించడానికి ట్రస్ట్ కార్యకర్తలు శ్రమించారని కొనియాడారు.
(7 / 7)
ప్రజాసేవకే ఎన్టీఆర్ ట్రస్ట్ అంకితం అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకే యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజల స్పందన చూశాక మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ధైర్యం, ప్రోత్సాహం వచ్చాయని.. రక్తదానం ప్రాణదానంతో సమానం అని వివరించారు.
ఇతర గ్యాలరీలు