Neeraj Chopra Final Live streaming: పసిడిపై గురి: నీరజ్ చోప్రా ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
- Neeraj Chopra Final Live streaming: పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఫైనల్ చేరాడు. అతడు గోల్డ్ మెడల్ సాధిస్తాడనే అంచనాలు భారీగా ఉన్నాడు. నీరజ్ చోప్రా ఫైనల్ ఎప్పుడు ఉందో.. లైవ్ ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
- Neeraj Chopra Final Live streaming: పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఫైనల్ చేరాడు. అతడు గోల్డ్ మెడల్ సాధిస్తాడనే అంచనాలు భారీగా ఉన్నాడు. నీరజ్ చోప్రా ఫైనల్ ఎప్పుడు ఉందో.. లైవ్ ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
గత టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ 2024లోనూ అతడు బంగారు పతకం సాధించడం ఖాయమనే ఆశలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే నేడు (ఆగస్టు 6) క్వాలిఫికేషన్ రౌండ్‍లో దుమ్మురేపి ఫైనల్ చేరాడు నీరజ్.(AP)
(2 / 5)
పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‍లో నేడు నీరజ్ చోప్రా ఏకంగా 89.34 మీటర్లు బల్లెం విసిరి ఫైనల్‍లో అడుగుపెట్టాడు. తన కెరీర్లోనే రెండో బెస్ట్ త్రోను నమోదు చేశాడు. టోక్యోలో గోల్డ్ సాధించిన దాని కంటే (87.58 మీటర్లు) ఎక్కువ దూరం విసిరాడు. గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచి పారిస్‍లో స్వర్ణ పతక పోరుకు చేరాడు. (PTI)
(3 / 5)
నీరజ్ చోప్రా బరిలోకి దిగే పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ ఆగస్టు 8వ తేదీన జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 8వ తేదీన రాత్రి 11 గంటల 55 నిమిషాలకు ఈ ఫైనల్ పోరు ఉండనుంది. (PTI)
(4 / 5)
పారిస్ ఒలింపిక్స్ 2024ను భారత్‍లో స్పోర్ట్ 18 నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో చూడొచ్చు. డిజిటల్ విషయానికి వస్తే, జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో వీక్షించొచ్చు. నీరజ్ చోప్రా ఫైనల్‍ను వాటిలో ఆగస్టు 8 రాత్రి 11.55 గంటలకు లైవ్ చూడొచ్చు. (PTI)
ఇతర గ్యాలరీలు