పిల్లల పట్ల ఈ 5 విషయాల్లో కఠినంగా ఉండటం తప్పేం కాదు, మీ కోపం వారికి మంచే చేస్తుంది!
- పిల్లల పట్ల తల్లిదండ్రులు కఠినంగా ఉండటం తప్పని చాలా మంది చెబుతుంటారు. కానీ కొన్ని విషయాల్లో కఠినంగా ఉండటం తప్పనిసరి అని, లేకపోతే వారు చెడిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కఠినంగా ఉండాలో తెలుసుకుందాం రండి.
- పిల్లల పట్ల తల్లిదండ్రులు కఠినంగా ఉండటం తప్పని చాలా మంది చెబుతుంటారు. కానీ కొన్ని విషయాల్లో కఠినంగా ఉండటం తప్పనిసరి అని, లేకపోతే వారు చెడిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కఠినంగా ఉండాలో తెలుసుకుందాం రండి.
(1 / 6)
పిల్లల మనసు సున్నితమైనదే. అలాగని దాన్ని అన్నిసార్లు సున్నితంగా చూడటం మంచిది కాదు. ఎందుకంటే చిన్ననాటి నుంచే వారు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. వీటిని పెద్దయ్యాక వారు నేర్చుకోలేరు. పోనీలే చిన్న పిల్లలే కదా తర్వాత నేర్చుకుంటారులే అని వదిలేశారంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. పిల్లల పట్ట మీరు ఎలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలో తెలుసుకోండి.
(pexel)(2 / 6)
పిల్లల స్క్రీన్ టైం విషయంలో తల్లిదండ్రులుగా మీరు కఠినంగా ఉండటంలో తప్పేం లేదు. ఇది వారిలో సృజనాత్మకత, సమాజంతో సంభాషించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఫోన్ పట్టుకుని కూర్చోవడం వల్ల వారు బయటి ప్రపంచం గురించి తెలుసుకోలేరు, ప్రజలతో కలిసిపోలేరు.
(pexel)(3 / 6)
పిల్లలు పెద్ద వారైనా, చిన్న వారైన వారి వయసు తగిన పనులను వారి చేత చేయించడంలో మీకు స్ట్రిక్ట్ గా ఉండాలి. పోనీలే పిల్లలే కదా అని వదిలేయకూడదు. ఇది వారి బాధ్యతను, కష్టపడి పని చేసే తత్వాన్ని, సమన్వయాన్ని పెంచడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో సంతోషకరమైన కుటుంబాన్ని ఏర్పరుచుతుంది.
(pexel)(4 / 6)
ఇతరులతో గౌరవంగా మెలగడం ఎలాగో పిల్లలకు నేర్పించడంలో మీరు కాస్త కఠినంగానే ఉండాలి. పిల్లలకు ఏం తెలుసు పెద్దయ్యాక అలవాటు అవుతుందిలే అని వదిలేయకూడదు. ప్లీజ్, థాంక్స్, సారీ వంటి పదాలను ఉపయోగించడం వారికి చిన్నప్పటి నుంచే నేర్పించాలి.
(pexel)(5 / 6)
పిల్లల నిద్ర విషయంలో తల్లిదండ్రులుగా మీరు చాలా కఠినంగా ఉండాలి. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్ర క్రమశిక్షణను పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు శరీరాన్ని, మెదడును చురుగ్గా ఉంచుతుంది.
(pexel)ఇతర గ్యాలరీలు