(1 / 7)
ఏపీలోని పాపికొండలను చూసేందుకు చాలా మంది పర్యాటకులు తరలివస్తుంటారు. తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన పర్వత శ్రేణిగా ఇవి ఉంటాయి. ఇవి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి.
(Image Source AP Tourism)(2 / 7)
పాపికొండలు చూసేందుకు రాజమండ్రి లేదా భద్రాచలం నుంచి వెళ్లొచ్చు.
రాజమహేంద్రవరం నుండి పాపికొండల విహార యాత్ర దేవిపట్నం మండలంలోని పోశమ్మగండి గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడినుండి లాంచిలో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరంటాలపల్లి వరకు సాగుతుంది. ఈ యాత్రలో గోదావరి చాలా తక్కువ వెడల్పుతో కొండల మధ్య ప్రవహిస్తూ మరింత రమణీయంగా వుంటుంది.
(3 / 7)
అయితే ప్రతి ఏడాది కూడా వరద సమయంలో ఈ యాత్రపై ఆంక్షలు విధిస్తున్నారు. గతంలో జరిగిన దుర్ఘటనల నేపథ్యంలో ఈ ఆంక్షలను అమలు చేస్తున్నారు. తాజాగా వర్షాకాలం రావటంతో….గోదావరిలో వరద మొదలైంది. నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
(Image Source AP Tourism)(4 / 7)
తాజాగా విహారయాత్రపై ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అల్లూరి జిల్లాలోని దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. వర్షంతో పాటు గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాపికొండల విహార యాత్రకు బ్రేకులు పడినట్లు అయింది.
(5 / 7)
2018లో పాపికొండల విహార యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2019 సెప్టెంబరు నెలలో కచ్చలూరు బోటు ప్రమాదం తరువాత పాపికొండల విహార యాత్రను ప్రభుత్వం నిషేధించింది. తిరిగి 2021 నవంబర్ 7వ తేదీన పాపికొండల విహారయాత్రను ప్రారంభించారు. అయితే ఆ ప్రమాదం కొన్ని గుణపాఠాలు నేర్పింది. దీంతో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా వరదలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పాపికొండల విహార యాత్రను రద్దు చేసున్నారు.
(6 / 7)
జాతీయ వనంగా గుర్తింపు పొందిన పాపికొండలు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అలాగే తెలంగాణలోని భద్రాచలానికి కూడా దాదాపుగా అదే దూరం ఉంటుంది. రెండు పర్వత శ్రేణులుగా ఉండే పాపికొండల ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది.
(7 / 7)
మళ్లీ గోదావరిలో వరద తగ్గముఖం పట్టి… నిలకడగా ఉన్న సమయంలోనే రాకపోకలకు అనుమతులు వస్తాయి.అప్పటి వరకు పాపికొండల విహార యాత్ర నిలిపివేస్తారు.
(image source @TravelTelangana)ఇతర గ్యాలరీలు