Panic Attack Symptoms : ఎవరైనా పానిక్ అటాక్ అయితే కంగారుపడకుండా ఇలా చేయండి..-panic attack symptoms and tips for manage that situation ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Panic Attack Symptoms And Tips For Manage That Situation

Panic Attack Symptoms : ఎవరైనా పానిక్ అటాక్ అయితే కంగారుపడకుండా ఇలా చేయండి..

Jan 24, 2023, 09:33 AM IST Geddam Vijaya Madhuri
Jan 24, 2023, 09:33 AM , IST

  • Panic Attack Symptoms and Manage : పానిక్ అటాక్ లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. ఓ వ్యక్తిని చూసినా.. మరేదైనా పరిస్థితుల్లో చిక్కుకున్నా.. హఠాత్తుగా పానిక్ అటాక్​కు గురవుతారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి మరణ భయం కూడా ఉంటుంది. మీ ముందు ఎవరైనా ఈ పరిస్థితిలో ఉంటే.. మీరు ఎలా వారిని కంట్రోల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పానిక్ అటాక్ సమస్యలో ఛాతీలో దడ, చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం వంటివి ఉంటాయి. ఏదైన చూసిన తర్వాత హఠాత్తుగా ఇవి వస్తాయి. తీవ్ర భయాందోళనలు మరణ భయానికి కూడా దారితీయవచ్చు. సంఘటన అంత తీవ్రమైనది కాకపోయినా.. వ్యక్తి తన ముందు భయంకరమైన ప్రమాదం ఉందని భావించడం ప్రారంభిస్తాడు.

(1 / 6)

పానిక్ అటాక్ సమస్యలో ఛాతీలో దడ, చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం వంటివి ఉంటాయి. ఏదైన చూసిన తర్వాత హఠాత్తుగా ఇవి వస్తాయి. తీవ్ర భయాందోళనలు మరణ భయానికి కూడా దారితీయవచ్చు. సంఘటన అంత తీవ్రమైనది కాకపోయినా.. వ్యక్తి తన ముందు భయంకరమైన ప్రమాదం ఉందని భావించడం ప్రారంభిస్తాడు.(Freepik)

పురుషుల కంటే మహిళలు ఎక్కువగా భయాందోళనలకు గురవుతారు. ఈ సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. అయినప్పటికీ.. పానిక్ అటాక్స్ ధోరణి వయస్సుతో పెరుగుతుంది.

(2 / 6)

పురుషుల కంటే మహిళలు ఎక్కువగా భయాందోళనలకు గురవుతారు. ఈ సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. అయినప్పటికీ.. పానిక్ అటాక్స్ ధోరణి వయస్సుతో పెరుగుతుంది.(Freepik)

వైద్యుల ప్రకారం.. గుండె జబ్బులు, హైపర్ థైరాయిడిజం, హైపోగ్లైసీమియా, సోషల్ ఫోబియా వంటి సమస్యలు ఉంటే.. భయాందోళనల ధోరణి పెరుగుతుంది.

(3 / 6)

వైద్యుల ప్రకారం.. గుండె జబ్బులు, హైపర్ థైరాయిడిజం, హైపోగ్లైసీమియా, సోషల్ ఫోబియా వంటి సమస్యలు ఉంటే.. భయాందోళనల ధోరణి పెరుగుతుంది.(Freepik)

ఎవరైనా మీ కళ్ల ముందు ఇలా పానిక్ అటాక్ అవుతుంటే.. అతని నోటిపై కొంచెం నీరు చల్లి.. కొంచెం నీరు తాగించండి. చల్లని నీరు తాగడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే తన చేతులు లేదా కాళ్లను చల్లటి నీటిలో ఉంచడం వల్ల బాధితుడికి మరింత సౌకర్యం లభిస్తుంది.

(4 / 6)

ఎవరైనా మీ కళ్ల ముందు ఇలా పానిక్ అటాక్ అవుతుంటే.. అతని నోటిపై కొంచెం నీరు చల్లి.. కొంచెం నీరు తాగించండి. చల్లని నీరు తాగడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే తన చేతులు లేదా కాళ్లను చల్లటి నీటిలో ఉంచడం వల్ల బాధితుడికి మరింత సౌకర్యం లభిస్తుంది.(Freepik)

ఆందోళన చెందే వ్యక్తి కూర్చొనివ్వండి. వారికోసం సురక్షితమైన స్థలాన్ని కనుగొని కూర్చొనివ్వండి. ఈ పానిక్ అటాక్స్ అధిక ఆందోళన వల్ల సంభవించవచ్చు. ఆ సందర్భంలో గ్రౌండింగ్ ప్రభావం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే వారిని కూర్చొనివ్వండి.

(5 / 6)

ఆందోళన చెందే వ్యక్తి కూర్చొనివ్వండి. వారికోసం సురక్షితమైన స్థలాన్ని కనుగొని కూర్చొనివ్వండి. ఈ పానిక్ అటాక్స్ అధిక ఆందోళన వల్ల సంభవించవచ్చు. ఆ సందర్భంలో గ్రౌండింగ్ ప్రభావం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే వారిని కూర్చొనివ్వండి.(Freepik)

గ్రౌండింగ్ పద్ధతి 5-4-3-2-1 పద్ధతి. మొదట బాధితుడిని కామ్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత మెల్లగా వారి చుట్టూ ఏ ఐదు వస్తువులను చూడగలుగుతున్నారో అడగండి. తర్వాత ఏ నాలుగు వస్తువులను తాకగలరో చెప్పమనండి. తర్వాత ఏ మూడు శబ్దాలు వినగలరు.. ఏ రెండు వస్తువులను వాసన చూడగలరు.. ఏది రుచి చూడగలరో అనేది చివరి ప్రశ్న. ప్రశ్నలు, సమాధానాలను ఒక్కొక్కటిగా అడగి వారిని డైవర్ట్ చేయండి. అప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. 

(6 / 6)

గ్రౌండింగ్ పద్ధతి 5-4-3-2-1 పద్ధతి. మొదట బాధితుడిని కామ్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత మెల్లగా వారి చుట్టూ ఏ ఐదు వస్తువులను చూడగలుగుతున్నారో అడగండి. తర్వాత ఏ నాలుగు వస్తువులను తాకగలరో చెప్పమనండి. తర్వాత ఏ మూడు శబ్దాలు వినగలరు.. ఏ రెండు వస్తువులను వాసన చూడగలరు.. ఏది రుచి చూడగలరో అనేది చివరి ప్రశ్న. ప్రశ్నలు, సమాధానాలను ఒక్కొక్కటిగా అడగి వారిని డైవర్ట్ చేయండి. అప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. (Freepik)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు