(1 / 8)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తున్న విషయం తెలుసు కదా. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ తో రాబోతోంది.
(2 / 8)
పంచాయత్ సీజన్ 4 జూన్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త సీజన్ కోసం ఇందులోని నటీనటులు ఎంత మొత్తం అందుకున్నారో ఒకసారి చూద్దాం.
(3 / 8)
మిస్టర్ సెక్రటరీ - ఈ సిరీస్ లో 'అభిషేక్ త్రిపాఠి' అలియాస్ 'సచివ్ జీ' పాత్ర పోషిస్తున్న పంచాయత్ లీడ్ జితేంద్ర కుమార్ సీజన్ 4 కోసం ఒక్కో ఎపిసోడ్ కు రూ.70,000 భారీ పారితోషికం తీసుకుంటున్నాడు.
(4 / 8)
ఏబీపీ రిపోర్టు ప్రకారం.. ఆ లెక్కన మొత్తం సీజన్ కు జితేంద్ర రూ.5.6 లక్షలు సంపాదించనున్నాడు. ప్రస్తుతానికి, జితేంద్ర కుమార్ కచ్చితమైన ఫీజులకు సంబంధించిన సమాచారం ఇంకా బయటకు రాలేదు.
(5 / 8)
నీనా గుప్తా - నటి నీనా గుప్తా ఈ సిరీస్ లో 'మంజు దేవి' పాత్రతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఒక్కో ఎపిసోడ్ కు ఆమె దాదాపు రూ.50 వేల వరకు పారితోషికం అందుకుంది. ఆమె మొత్తం రెమ్యునరేషన్ రూ.4 లక్షలకు చేరింది.
(6 / 8)
రఘుబీర్ యాదవ్ - రఘుబీర్ యాదవ్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.40 వేలు తీసుకున్నాడు. దీని ప్రకారం కొత్త సీజన్ లో మొత్తం రూ.3.2 లక్షలు సంపాదించాడు.
(7 / 8)
చందన్ రాయ్ - వికాస్ శుక్లాగా నటిస్తున్న చందన్ రాయ్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.20,000 పారితోషికం అందుకోనున్నాడు. చందన్ కు పంచాయత్ నుంచి మొత్తం రూ.1.6 లక్షలు వస్తాయి.
(8 / 8)
ఫైజల్ మాలిక్ - అదే సమయంలో ప్రహ్లాద్ పాత్ర పోషిస్తున్న ఫైజల్ మాలిక్ ప్రతి ఎపిసోడ్ కు రూ.20 వేలు అంటే మొత్తం రూ .1.6 లక్షలు సంపాదించాడు.
ఇతర గ్యాలరీలు