WTC Points Table: బంగ్లా చేతిలో ఓడి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కుదేలైన పాకిస్థాన్.. ప్రస్తుతం టేబుల్ ఎలా ఉందంటే..-pakistan slips 8th in wtc points table after defeat against bangladesh in 1st test and india india remains on top ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Wtc Points Table: బంగ్లా చేతిలో ఓడి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కుదేలైన పాకిస్థాన్.. ప్రస్తుతం టేబుల్ ఎలా ఉందంటే..

WTC Points Table: బంగ్లా చేతిలో ఓడి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కుదేలైన పాకిస్థాన్.. ప్రస్తుతం టేబుల్ ఎలా ఉందంటే..

Aug 25, 2024, 07:44 PM IST Chatakonda Krishna Prakash
Aug 25, 2024, 07:38 PM , IST

  • ICC WTC Points Table: బంగ్లాదేశ్ చేతిలో తొలి టెస్టులో పాకిస్థాన్ పరాజయం పాలైంది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లు పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. భారత్ ప్రస్తుతం టాప్‍లో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇక్కడ చూడండి.

పాకిస్థాన్‍పై తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. టెస్టు చరిత్రలో తొలిసారి పాక్‍పై బంగ్లా గెలిచింది. మ్యాచ్ నాలుగో రోజైన నేడు (ఆగస్టు 25) 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) పాయింట్ల పట్టికలో బంగ్లా పైకి వెళ్లగా.. పాకిస్థాన్ కుదేలైంది.

(1 / 5)

ఈ గెలుపుతో డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఆరో ప్లేస్‍కు ఎగబాకింది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో బంగ్లాదేశ్ 5 టెస్టుల్లో 2 గెలిచి.. మూడు ఓడింది. 24 పాయింట్లు, 40 శాతంతో ఆరో స్థానంలో ఉంది. 

(2 / 5)

ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్‍లో పాకిస్థాన్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. తొమ్మిది జట్లు ఉన్న ఈ పట్టికలో వెస్టిండీస్ చివరి ప్లేస్‍లో ఉండగా.. దానిపై పాక్ నిలిచింది. ఈ సైకిల్‍లో పాకిస్థాన్ ఇప్పటి వరకు 6 టెస్టుల్లో 2 గెలిచి నాలుగు ఓడింది. 22 పాయింట్లు, 30.56 శాతంతో 8వ స్థానానికి పడిపోయింది. 

(3 / 5)

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం టాప్‍లోనే కొనసాగింది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍లు ఆడిన టీమిండియా 6 టెస్టుల్లో గెలిచింది. 2 ఓడగా.. ఓ మ్యాచ్ డ్రా అయింది. దీంతో 74 పాయింట్లు, 68.51 శాతంతో టాప్ ప్లేస్‍లో భారత్ ఉంది. ఆస్ట్రేలియా (62.50 శాతం, 90 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. 

(4 / 5)

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం న్యూజిలాండ్ (50శాతం) మూడో ప్లేస్‍లో ఉండగా.. ఇంగ్లండ్ (41.07 శాతం) నాలుగో ప్లేస్‍లో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్ ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది ప్లేస్‍ల్లో నిలిచాయి. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు