రేపు పద్మినీ ఏకాదశి.. పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి-padmini ekadashi 2023 dos and donts to gain lord vishnu blessings ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  రేపు పద్మినీ ఏకాదశి.. పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి

రేపు పద్మినీ ఏకాదశి.. పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి

Jul 28, 2023, 10:45 AM IST HT Telugu Desk
Jul 28, 2023, 10:45 AM , IST

  • Padmini ekadashi 2023: ఏకాదశి తిథి చాలా పవిత్రమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి ప్రాముఖ్యతను వివరిస్తూ ఆయా గ్రంథాలు కొన్ని నియమాలను కూడా సూచిస్తున్నాయి. ఏకాదశి తిథి నాడు చేయాల్సినవి, చేయకూడని పనులు ఇక్కడ తెలుసుకోండి.

ఏకాదశి తిథి హిందూ మతంలోని అన్ని తిథిలలో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఏకాదశి తిథి రోజున విష్ణువుకు అంకితం చేస్తారు. ఈ రోజున ఉపవాసం, జపం, తపస్సు, ధ్యానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రంథాల ప్రకారం, ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల ప్రాపంచిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. జనన మరణ బంధాల నుండి విముక్తి పొంది చివరకు వైకుంఠ ధామం పొందుతాం. అయితే ఏకాదశి రోజున చేయాల్సినవి, చేయకూడని పనులను పురాణాలు విశదీకరించాయి. 

(1 / 6)

ఏకాదశి నాడు పగటి పూట నిద్రించకూడదు, రాత్రి కూడా నేలపైనే నిదురించడం శ్రేయస్కరం. బ్రహ్మచర్యం పాటించాలి. ముందురోజు దశమి రోజున కూడా రాత్రి పూట అల్పాహారంతో సరిపెట్టుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

(2 / 6)

ఏకాదశి రోజు రెండు పూటలూ ఉపవాసం ఉండడం మంచిది. అలా వీలుకాని పక్షంలో సాత్విక అల్పాహారం తీసుకోవచ్చు. మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఉపవాసం దీక్ష నిషేధం. అంటే వారు ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం ఉన్న వారు ఆహారం గురించి ఆలోచన చేయకుండా విష్ణుమూర్తి సేవలో తరించాలి.

(3 / 6)

ఏకాదశి రోజున కోపం, అబద్ధాలు చెప్పడం, ఇతరులకు చెడు చేయడం మానుకోవాలి. ఇవన్నీ కాకుండా ఈ రోజున శ్రీమహావిష్ణువు సేవలో తరించాలి.

(4 / 6)

ఏకాదశి నాడు విష్ణు మూర్తికి నైవేద్యం సమర్పించేటప్పుడు తప్పనిసరిగా తులసీదళాలను అందులో ఉంచాలి.

(5 / 6)

ఏకాదశి రోజున కొన్ని వస్తువులకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు పప్పు, చిక్కుడు, క్యాబేజీ, క్యారెట్, బచ్చలి కూర మొదలైన వాటిని తినకూడదు. అంతే కాకుండా ఈ రోజున శారీరకంగా, మానసికంగా చెడు పనులు, ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఏకాదశి తిథిని మోక్షదాయిని తిథి అంటారు, కాబట్టి ఏకాదశి తిథి నాడు ఈ పనులు చేయకుండా ఉండాలి. మద్యపానం, దొంగతనం, హింస, కోపం, శృంగారం, సంభోగం, కపటత్వం మొదలైన వాటిని ఏకాదశి రోజున మానుకోవాలి. క్షమాగుణం, క్షమాపణలు కోరే గుణం అలవరచుకోవాలి.

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు