తెలుగు న్యూస్ / ఫోటో /
OYO new rules : పెద్ద షాక్ ఇచ్చిన ఓయో! ఇక వారికి నో ఎంట్రీ- కొత్త రూల్స్ ఇవే..
- ప్రముఖ హోటల్ బుకింగ్ సంస్థ ఓయో పెద్ద నిర్ణయమే తీసుకుంది! తన భాగస్వామ్య హోటళ్ల చెక్- ఇన్ రూల్స్‌ని సవరించింది. తాజా రూల్స్ ప్రకారం.. పెళ్లి కాని జంటలు ఇకపై రూమ్స్‌లో చెక్ ఇన్ చేయలేరు. పూర్తి వివరాల్లోకి వెళితే..

(1 / 5)
తాజా రూల్స్ ప్రకారం.. ఓయో అనుసంధాన హోటల్స్‌లో బుకింగ్‌లు చేయాలనుకునే జంటలందరూ చెక్-ఇన్ సమయంలో తమ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన ప్రూఫ్‌లను సమర్పించాలి. ఆన్లైన్ బుకింగ్లకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. అంటే అవివాహితులకు నో ఎంట్రీ అన్నట్టే!
(2 / 5)
అయితే స్థానిక సామాజిక సెన్సిబులిటీకి అనుగుణంగా.. బుకింగ్స్‌ని ఆమోదించాలా? లేదా? అన్న విషయంపై భాగస్వామ్య హోటళ్లే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓయో స్పష్టం చేసింది.(REUTERS)
(3 / 5)
ఓయో హోటల్స్‌పై ఇప్పటివరకు ఎవైనా చెడు అభిప్రాయాలు ఉంటే వాటిని మార్చేందుకు, కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారం, ఒంటరి ప్రయాణికులకు సురక్షితమైన ఎక్స్‌పీరియెన్స్‌ని అందించే బ్రాండ్‌గా సంస్థను నిలిపేందుకు ఈ చర్యలు పనిచేస్తాయని కంపెనీ భావిస్తోంది.
(4 / 5)
అయితే ఈ కొత్త రూల్ మొదట ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కి వర్తిస్తుంది. ఈ గైడ్‌లైన్స్ వెంటనే మీరట్‌లోని ఓయో భాగస్వామ్య హోటళ్లపై ప్రభావం చూపనున్నాయి.
ఇతర గ్యాలరీలు