OTT Valentine's Day week releases: వాలెంటైన్స్ డే వీక్‌లో ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
OTT Valentine's Day week releases: వాలెంటైన్స్ డే వీక్ వచ్చేసింది. మరి ఈ వారం ఓటీటీలోకి కొత్త రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూడండి. వీటిలో రొమాన్స్, థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లలోని కంటెంట్ చూడొచ్చు.
(1 / 8)
OTT Valentine's Day week releases: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. అయితే ప్రేమికుల దినోత్సవం వారంలో ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో చూద్దాం. ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, సిరీస్ రాబోతున్నాయి.
(2 / 8)
OTT Valentine's Day week releases: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో మంగళవారం (ఫిబ్రవరి 11) నుంచి బాబీ ఔర్ రిషీ కీ లవ్ స్టోరీ అనే మూవీ రానుంది. వాలెంటైన్స్ సందర్భంగా ఈ మూవీని తీసుకొస్తున్నారు.
(3 / 8)
OTT Valentine's Day week releases: జయం రవి, నిత్య మేనన్ జంటగా నటించిన మూవీ కాదలిక్క నేరమిళ్లై అనే మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి ఫిబ్రవరి 11న రానుంది. ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది.
(4 / 8)
OTT Valentine's Day week releases: నెట్‌ఫ్లిక్స్ లోకి సోమవారం (ఫిబ్రవరి 10) సర్వైవింగ్ బ్లాక్ హాక్ డౌన్ అనే డాక్యుమెంటరీ సిరీస్ వచ్చింది. సోమాలియా, యూఎస్ఏ మధ్య 1993లో జరిగిన యుద్ధంపై రూపొందించిన డాక్యుమెంటరీ ఇది.
(5 / 8)
OTT Valentine's Day week releases: యామీ గౌతమ్, ప్రతీక్ గాంధీ జంటగా నటించిన 'ధూమ్ ధామ్' ఫిబ్రవరి 14న నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. శోభనం రోజే ఓ డ్రగ్స్ గ్యాంగ్ బారిన పడిన జంట కథే ఈ ధూమ్ ధామ్.
(6 / 8)
OTT Valentine's Day week releases: మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మలయాళం మూవీ మార్కో కూడా ఫిబ్రవరి 14నే సోనీ లివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది.
(7 / 8)
OTT Valentine's Day week releases: మెలో మూవీ అనే కొరియన్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇతర గ్యాలరీలు