OTT Web Series: ఓటీటీలోకి ఈ ఏడాది రాబోతున్న సూపర్ వెబ్ సిరీస్ ఇవే.. అన్నీ మిస్ కాకుండా చూడాల్సినవే..
- OTT Web Series: ఓటీటీలో వెబ్ సిరీస్ ఎక్కువగా చూసే వారికి 2025 ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ ఏడాది కొన్ని ఇంట్రెస్టింగ్ సిరీస్, సీక్వెల్స్ రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటి వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఇవి స్ట్రీమింగ్ కానున్నాయి.
- OTT Web Series: ఓటీటీలో వెబ్ సిరీస్ ఎక్కువగా చూసే వారికి 2025 ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ ఏడాది కొన్ని ఇంట్రెస్టింగ్ సిరీస్, సీక్వెల్స్ రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటి వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఇవి స్ట్రీమింగ్ కానున్నాయి.
(1 / 7)
OTT Web Series: ఓటీటీలోకి 2025లో హిందీలో కొన్ని మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఎంతో ఆసక్తి రేపుతున్న సీక్వెల్స్ కూడా ఉండటం విశేషం. మరి అవేంటో చూడండి.
(2 / 7)
OTT Web Series: ప్రైమ్ వీడియోలోని టాప్ వెబ్ సిరీస్ లలో ఒకటి పాతాళ్ లోక్. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
(3 / 7)
OTT Web Series: ప్రైమ్ వీడియోలోనే వచ్చిన మరో టాప్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకోగా.. మూడో సీజన్ 2025లోనే వస్తుందని భావిస్తున్నారు. ఈ మధ్యే షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
(4 / 7)
OTT Web Series: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్న వెబ్ సిరీస్ కూడా ఈ ఏడాదే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఓ స్టార్ హీరో కొడుకు డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండటం ఆసక్తి రేపుతోంది.
(5 / 7)
OTT Web Series: బాలీవుడ్ పై చెరగని ముద్ర వేసిన కుటుంబాల్లో రోషన్స్ ఫ్యామిలీ కూడా ఒకటి. వీళ్లపై రూపొందించిన ది రోషన్స్ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్ లో జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
(6 / 7)
OTT Web Series: బాలీవుడ్ నటి కాజోల్ నటించిన వెబ్ సిరీస్ ది ట్రయల్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో వచ్చిన తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది రెండో సీజన్ కూడా రాబోతోంది.
ఇతర గ్యాలరీలు