ఓటీటీలో దంచికొడుతున్న 800 కోట్ల సినిమా.. దాంతోపాటు మరో 8 మూవీస్ ట్రెండింగ్‌లో.. మీరెన్ని చూశారు?-ott trending movies telugu on netflix jiohotstar court dragon jewel thief chhaava mad square ride ott streaming ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఓటీటీలో దంచికొడుతున్న 800 కోట్ల సినిమా.. దాంతోపాటు మరో 8 మూవీస్ ట్రెండింగ్‌లో.. మీరెన్ని చూశారు?

ఓటీటీలో దంచికొడుతున్న 800 కోట్ల సినిమా.. దాంతోపాటు మరో 8 మూవీస్ ట్రెండింగ్‌లో.. మీరెన్ని చూశారు?

Published May 09, 2025 04:25 PM IST Sanjiv Kumar
Published May 09, 2025 04:25 PM IST

ఓటీటీలో తొమ్మిది సినిమాలు ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. ఎప్పుడో ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఇప్పటికీ టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకుని అలరిస్తున్నాయి. వాటిలో రూ. 800 కోట్లకుపైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టిన మూవీతోపాటు ప్రభాస్ పాన్ ఇండియా సినిమా కూడా ఉంది. మరి అవేంటో లుక్కేద్దాం.

ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీస్: కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలో వస్తుండగా మరికొన్ని నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. కానీ, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సినిమాలు అనతికాలంలోనే ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంటాయి. ఎప్పుడో ఓటీటీ రిలీజ్ అయి ఇప్పటికీ ఓటీటీ ట్రెండింగ్‌లో ఉన్న సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

(1 / 10)

కోర్టు వ్యవస్థకు వ్యతిరేకంగా జరిపిన సామాన్యుడి పోరాటమే కోర్ట్ ఏ స్టెట్ వర్సెస్ నోబడీ. నెట్ ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన కోర్ట్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

(2 / 10)

జువెల్ థీఫ్ ఓటీటీ - ఇటీవల నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన 'జువెల్ థీఫ్' చిత్రం టాప్ 3 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్ సినిమాలతో పోటీ పడుతోంది.

(3 / 10)

మార్కో ఓటీటీ: ఓటీటీ ట్రెండింగ్ లిస్ట్‌లో మార్కో సినిమా కూడా ఉంది, ఇందులో మీరు చాలా యాక్షన్‌ను చూస్తారు. సోనీ లివ్, ఆహాలలో మార్కో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

(4 / 10)

థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రూ.827 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఛావా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. చాలా కాలం తర్వాత కూడా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌ సినిమాల్లో దంచికొడుతోంది. ఇందులో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించారు.

(5 / 10)

డ్రాగన్ ఓటీటీ: ఫేక్ డిగ్రీ ఆధారంగా ఒక అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. కానీ, నిజం బయటకు వచ్చినప్పుడు ఇబ్బంది సమస్యలు మొదలు అవుతాయి. అప్పుడు కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించి ఆత్మగౌరవాన్ని తిరిగి పొందాలని నిర్ణయించుకున్నాడు. ఆ సినిమానే డ్రాగన్. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో డ్రాగన్ ఇప్పటికీ ఆకట్టుకుంటోంది.

(6 / 10)

హౌస్ ఫుల్ 4 ఓటీటీ: ఇటీవల హౌస్ ఫుల్ 5 సినిమా అనౌన్స్ చేశారు. దీంతో దాని హౌస్ ఫుల్ పార్ట్-4 ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్‌లో ట్రెండింగ్ అవుతోంది.

(7 / 10)

తొలి భాగం 'మ్యాడ్' సూపర్ హిట్ కావడంతో రెండో భాగానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో మ్యాడ్ స్క్వేర్ సినిమాను ఎక్కువగా చూస్తున్నారు. దాంతో మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

(8 / 10)

అజయ్ దేవగణ్ నటించిన 'రైడ్ 2' సినిమా విడుదలై ఆకట్టుకుంటోంది. దీంతో జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న రైడ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

(9 / 10)

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' సినిమా ఇప్పటికీ హాట్‌స్టార్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. జియో హాట్‌స్టార్‌లో సలార్ హిందీ వెర్షన్ ఓటీటీ ట్రెండింగ్‌లో ఏడో స్థానంలో దూసుకుపోతోంది.

(10 / 10)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు