(1 / 5)
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ సినిమా ఈ గురువారం (ఏప్రిల్ 24) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవనుంది.
(2 / 5)
వీర ధీర శూరన్ చిత్రం ఈ ఏడాది మార్చి 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుంది.
(3 / 5)
వీర ధీర శూరన్ చిత్రంలో విక్రమ్‍తో పాటు ఎస్‍జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దసరా విజయన్, పృథ్వి కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24 నుంచి ప్రైమ్ వీడియోలో ఐదు భాషల్లో వీక్షించొచ్చు.
(4 / 5)
తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ ‘తరుణం’ ఈ శుక్రవారం (ఏప్రిల్ 25) టెంట్‍కొట్టా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. కిషన్ దాస్, స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రానికి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. జనవరి 31న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.
(5 / 5)
నిరుమ్ మారమ్ ఉలగిల్ చిత్రం ఏప్రిల్ 25వ తేదీన సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఆంథాలజీ ఎమోషనల్ చిత్రంలో దిగ్గజ దర్శకుడు భారతీరాజా, రియో రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. బ్రిట్టో జేబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వస్తోంది.
ఇతర గ్యాలరీలు