(1 / 5)
అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో మే 23 ఒక్కరోజే ఏకంగా నాలుగు సినిమాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
(2 / 5)
'ఫియర్ స్ట్రీట్: ప్రోమ్ క్వీన్' మే 23న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 1988లో షాడీసైడ్ హైస్కూల్లో జరిగిన ఓ రాత్రి చుట్టూ కథ తిరుగుతుంది. ప్రజలను ఎంతగానో అలరించే టీనేజ్ హారర్ డ్రామా ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది.
(3 / 5)
మలయాళ హారర్ థ్రిల్లర్ 'హంట్' మే 23న మనోరమ మ్యాక్స్‌లో ప్రసారం కానుంది. తప్పిపోయిన అనస్థీషియా విద్యార్థి మిస్టరీని ఛేదించే ఫోరెన్సిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ పాత్రలో నటి భావన నటించారు. ఈ మూవీ ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది.
(4 / 5)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళ రొమాంటిక్ చిత్రం 'అభిలాశం' మే 23న ఓటీటీ రిలీజ్ కానుంది. ఇందులో సైజు కురుప్, తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
(5 / 5)
రియాలిటీ వెబ్ సిరీస్ 'ట్రూత్ అండ్ ట్రబుల్' మే 23న జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి యూట్యూబర్ హర్ష్ బెనివాల్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ షోలో జంటలు, కుటుంబ సభ్యులు లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కొంటారు.
ఇతర గ్యాలరీలు