
(1 / 9)
ఈ వారం ఓటీటీలో ఎన్నో సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో కచ్చితంగా చూసేలా చాలా స్పెషల్‌గా ఉన్న 8 సినిమాల గురించి తెలుసుకుందాం. నెట్‌ఫ్లిక్స్ నుంచి జియో హాట్ స్టార్ వరకు, అమెజాన్ ప్రైమ్ నుంచి జీ5 వరకు సెప్టెంబర్ 22-సెప్టెంబర్ 28 మధ్య ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

(2 / 9)
సోనీ లివ్‌లో 'చలో బులావా ఆయా హై మాతా నే బులాయా హై' ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ ఓటీటీ వెబ్ సిరీస్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. దీనికి సంబంధించిన టీజర్‌పై చాలా చర్చ జరగడం విశేషం.

(3 / 9)
సుందరకాండ ఓటీటీ- తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ సుందరకాండ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. నారా రోహిత్ హీరోగా చేసిన ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 23 నుంచి తెలుగులో ఓటీటీ ప్రీమియర్ కానుంది.

(4 / 9)
మార్వెల్ జాంబీస్ ఓటీటీ- మార్వెల్ సినిమాల అభిమానులు పిల్లలతో ఏదైనా చూడాలనుకుంటే మార్వెల్ జాంబీస్‌ను ట్రై చేయొచ్చు. అయితే, ఇది పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దవాళ్లకు కూడా నచ్చేలా తెరకెక్కించారని సమాచారం. సెప్టెంబర్ 24న జియో హాట్ స్టార్‌లో మార్వెల్ జాంబీస్ ఓటీటీ రిలీజ్ కానుంది.

(5 / 9)
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఉన్నవారి కోసం సెప్టెంబర్ 25న 'టూ మచ్ ఫన్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' పేరుతో ఈ అద్భుతమైన టాక్ షో రానుంది. ఇందులో అమీర్ నుంచి సల్మాన్ వరకు అందరూ పాల్గొంటారు.

(6 / 9)
సిద్ధాంత్ చతుర్వేది, తృప్తి డిమ్రీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ధడక్-2' చిత్రం సెప్టెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీ రేటింగ్ 7గా ఉంది.

(7 / 9)
అజయ్ దేవగన్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సెప్టెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కూడా యాక్ట్ చేసింది.

(8 / 9)
హృదయపూర్వం ఓటీటీ: మోహన్ లాల్, మాళవిక మోహనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'హృదయపూర్వం' సెప్టెంబర్ 26న జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి 7.1 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఇది తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

(9 / 9)
ది ఫ్రెండ్ ఓటీటీ- కామెడీ, డ్రామాగా తెరకెక్కిన సినిమా ది ఫ్రెండ్ సెప్టెంబర్ 28న జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుంది. ఇలా 8 సినిమాల్లో తెలుగులో 2 రిలీజ్ కానుండగా నాలుగు మూవీస్ ఒక్క జియో హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్ అవనున్నాయి.
ఇతర గ్యాలరీలు