OTT: ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని థ్రిల్లింగ్ సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లో చూడాల్సినవి ఇవే!-ott movies must watch on netflix amazon prime jio hotstar thriller films sookshmadarshini kill shakhahaari ott streaming ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott: ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని థ్రిల్లింగ్ సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లో చూడాల్సినవి ఇవే!

OTT: ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని థ్రిల్లింగ్ సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లో చూడాల్సినవి ఇవే!

Published Feb 23, 2025 02:14 PM IST Sanjiv Kumar
Published Feb 23, 2025 02:14 PM IST

  • Must Watch OTT Movies On Netflix Amazon Prime Hotstar: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన థ్రిల్లింగ్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ లేదా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతూ చూడాల్సిన మిస్ కాకూడని సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సినిమా పరిణామం చెందుతూ అందరికీ అందుబాటులోకి వచ్చింది. నేడు సినిమా మరింత అభివృద్ధి చెందుతూ మనం ఇంట్లోనే సులభంగా చూసేలా టెలివిజన్ వరకు చేరుకుంది. మహమ్మారి సమయంలో విస్తృతంగా ఉపయోగించబడిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం అత్యధిక ఆదరణను పొందుతున్నాయి. నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనే చిత్రాలు విడుదలయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మీరు తప్పకుండా చూడాల్సిన కొన్ని థ్రిల్లింగ్ స్టోరీ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

(1 / 5)

సినిమా పరిణామం చెందుతూ అందరికీ అందుబాటులోకి వచ్చింది. నేడు సినిమా మరింత అభివృద్ధి చెందుతూ మనం ఇంట్లోనే సులభంగా చూసేలా టెలివిజన్ వరకు చేరుకుంది. మహమ్మారి సమయంలో విస్తృతంగా ఉపయోగించబడిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం అత్యధిక ఆదరణను పొందుతున్నాయి. నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనే చిత్రాలు విడుదలయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మీరు తప్పకుండా చూడాల్సిన కొన్ని థ్రిల్లింగ్ స్టోరీ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

(Canva)

ఓటీటీ మలయాళ సినిమాలు: థ్రిల్లింగ్ కథాంశంతో సినిమాలు అంటే మలయాళ మూవీస్ గుర్తుకు వస్తాయి. ఆ స్థాయిలో మర్డర్ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ వంటి ఉత్కంఠభరిత చిత్రాలు మలయాళంలో వరుసకట్టుగా ఉన్నాయి. అంతేకాకుండా మలయాళ అగ్ర హీరోలు కూడా విభిన్న కథలను ఎంచుకుని నటిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఉత్కంఠభరిత చిత్రాల వరుసలో కొన్ని మలయాళ చిత్రాలు కచ్చితంగా ఉంటాయి.

(2 / 5)

ఓటీటీ మలయాళ సినిమాలు: 

థ్రిల్లింగ్ కథాంశంతో సినిమాలు అంటే మలయాళ మూవీస్ గుర్తుకు వస్తాయి. ఆ స్థాయిలో మర్డర్ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ వంటి ఉత్కంఠభరిత చిత్రాలు మలయాళంలో వరుసకట్టుగా ఉన్నాయి. అంతేకాకుండా మలయాళ అగ్ర హీరోలు కూడా విభిన్న కథలను ఎంచుకుని నటిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఉత్కంఠభరిత చిత్రాల వరుసలో కొన్ని మలయాళ చిత్రాలు కచ్చితంగా ఉంటాయి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: భారతీయ చిత్రాలు ఎక్కువగా విడుదలయ్యే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌గా మారింది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇటీవల విడుదలైన ప్రముఖ మలయాళ థ్రిల్లర్ చిత్రాలైన సూక్ష్మదర్శిని, మంజుమ్మల్ బాయ్స్, ఏ.ఆర్.ఎం, కిష్కింద కాండం అనే చిత్రాలు తప్పకుండా చూడాల్సినవిగా ఉన్నాయి. అంతేకాకుండా, 2023లో విడుదలైన కన్నూర్ స్క్వాడ్ చిత్రం కూడా అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇలాగే హిందీలో 2024లో విడుదలైన కిల్ కచ్చితంగా చూడాల్సిన యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ.  

(3 / 5)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: 

భారతీయ చిత్రాలు ఎక్కువగా విడుదలయ్యే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌గా మారింది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇటీవల విడుదలైన ప్రముఖ మలయాళ థ్రిల్లర్ చిత్రాలైన సూక్ష్మదర్శిని, మంజుమ్మల్ బాయ్స్, ఏ.ఆర్.ఎం, కిష్కింద కాండం అనే చిత్రాలు తప్పకుండా చూడాల్సినవిగా ఉన్నాయి. అంతేకాకుండా, 2023లో విడుదలైన కన్నూర్ స్క్వాడ్ చిత్రం కూడా అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇలాగే హిందీలో 2024లో విడుదలైన కిల్ కచ్చితంగా చూడాల్సిన యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ. 

 

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ:ప్రపంచవ్యాప్తంగా అనేక చిత్రాలు విడుదలయ్యే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. ఇందులో ఒరిజినల్స్ పేరుతో స్వయంగా ఉత్కంఠభరిత కథాంశాలతో కూడిన చిత్రాలను వరుసకట్టుగా రిలీజ్ అవుతుంటాయి. 2024లో విడుదలైన శిఖందర్ కా ముకాబలా అనే హిందీ చిత్రం దోపిడీ సంఘటనను ఆధారంగా చేసుకున్న కథ. ఇందులో తమన్నా, అవినాష్ తదితరులు నటించారు. తాప్సీ పన్ను, విక్రాంత్ నటించిన డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ మూవీ హసిన్ దిల్‌రుబా మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. దీని ఫస్ట్ ఫార్ట్ కూడా అత్యధిక ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ అయిన రెండవ భాగం కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ఈ ఉత్కంఠభరిత సినిమాల జాబితాలో తమిళంలో విడుదలైన మహారాజా, మేరీ క్రిస్మస్, మలయాళంలో విడుదలైన ఇరట్ట, సీబీఐ 5, టీచర్ వంటి అనేక చిత్రాలు ఉన్నాయి. వీటిని తప్పకుండా చూడండి.

(4 / 5)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ:

ప్రపంచవ్యాప్తంగా అనేక చిత్రాలు విడుదలయ్యే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. ఇందులో ఒరిజినల్స్ పేరుతో స్వయంగా ఉత్కంఠభరిత కథాంశాలతో కూడిన చిత్రాలను వరుసకట్టుగా రిలీజ్ అవుతుంటాయి. 2024లో విడుదలైన శిఖందర్ కా ముకాబలా అనే హిందీ చిత్రం దోపిడీ సంఘటనను ఆధారంగా చేసుకున్న కథ. ఇందులో తమన్నా, అవినాష్ తదితరులు నటించారు. తాప్సీ పన్ను, విక్రాంత్ నటించిన డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ మూవీ హసిన్ దిల్‌రుబా మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. దీని ఫస్ట్ ఫార్ట్ కూడా అత్యధిక ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ అయిన రెండవ భాగం కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ఈ ఉత్కంఠభరిత సినిమాల జాబితాలో తమిళంలో విడుదలైన మహారాజా, మేరీ క్రిస్మస్, మలయాళంలో విడుదలైన ఇరట్ట, సీబీఐ 5, టీచర్ వంటి అనేక చిత్రాలు ఉన్నాయి. వీటిని తప్పకుండా చూడండి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ: భారతీయ చిత్రాలు అధికంగా విడుదలయ్యే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అమెజాన్ ప్రైమ్ ఒకటి. ఇందులో కూడా థ్రిల్లింగ్ సన్నివేశాలతో తెరకెక్కిన అనేక సినిమాలు ఉన్నాయి. వాటిలో మలయాళంలో విడుదలైన ఆటం, కన్నడలో విడుదలైన శాఖాహారి, తెలుగులో విడుదలైన కళింగ వంటి చిత్రాలను ఎప్పటికీ మిస్‌ చేయకండి.

(5 / 5)

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ: 

భారతీయ చిత్రాలు అధికంగా విడుదలయ్యే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అమెజాన్ ప్రైమ్ ఒకటి. ఇందులో కూడా థ్రిల్లింగ్ సన్నివేశాలతో తెరకెక్కిన అనేక సినిమాలు ఉన్నాయి. వాటిలో మలయాళంలో విడుదలైన ఆటం, కన్నడలో విడుదలైన శాఖాహారి, తెలుగులో విడుదలైన కళింగ వంటి చిత్రాలను ఎప్పటికీ మిస్‌ చేయకండి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు