OU EMRC Short Film : గుత్తికోయ పిల్లలకు విద్యాబోధనపై ఓయూ షార్ట్ ఫిల్మ్- ఇంటర్నేషనల్ నేచర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు
- OU EMRC Short Film : ఓయూ ఈఏంఆర్సీ తీసిని షార్ట్ ఫిల్మ్ కు ఇంటర్నేషనల్ నేచర్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి బహుమతి దక్కింది. ఈఏంఆర్సీ డైరెక్టర్ రఘుపతి తీసిన రీచింగ్ ది అన్ రీచ్డ్ షార్ట్ ఫిల్మ్ ఈ అత్యున్నత పురస్కారాన్ని పొందింది.
- OU EMRC Short Film : ఓయూ ఈఏంఆర్సీ తీసిని షార్ట్ ఫిల్మ్ కు ఇంటర్నేషనల్ నేచర్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి బహుమతి దక్కింది. ఈఏంఆర్సీ డైరెక్టర్ రఘుపతి తీసిన రీచింగ్ ది అన్ రీచ్డ్ షార్ట్ ఫిల్మ్ ఈ అత్యున్నత పురస్కారాన్ని పొందింది.
(1 / 6)
ఉస్మానియా యూనివర్సిటీ ఈఏంఆర్సీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అత్యున్నత పురస్కారాలను పొందింది. ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ (EMRC) 16వ UGC-CEC ఇంటర్నేషనల్ నేచర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డెవలప్‌మెంట్ విభాగంలో మొదటి బహుమతిని గెలుచుకుంది.
(2 / 6)
ఈఏంఆర్సీ డైరెక్టర్ రఘుపతి లఘు చిత్రం “రీచింగ్ ది అన్‌రీచ్డ్” మానవ హక్కుల విభాగంలో ప్రశంసాపత్రాన్ని పొందింది. పర్యావరణం, అభివృద్ధి, మానవ హక్కులు, స్వచ్ఛ భారత్ గురించి అవగాహన కల్పించేందుకు యూజీసీ, సీఈసీ సంయుక్తంగా ఈ వార్షిక చలనచిత్ర పోటీని నిర్వహిస్తాయి. ఎంపిక చేసిన చిత్రాలను నేచుర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికేట్‌లను అందజేస్తారు.
(3 / 6)
ఈఏంఆర్సీ డైరక్టర్ రఘుపతి ఈ షార్ట్ ఫిల్మ్ ను ఓయూ జర్నలిజం విద్యార్థి సంతోష్ ఇస్రామ్, అతని స్నేహితుల భాగస్వామ్యంతో నిర్మించారు. ఏకోపాధ్యాయ భీమ్ చిల్డ్రన్స్ హ్యాపీనెస్ సెంటర్స్‌పై ఈ లఘు చిత్రాన్ని నిర్మించారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గుత్తికోయ సామాజిక వర్గానికి చెందిన పిల్లలకు విద్యాబోధన చేయడమే ఈ కేంద్రాల లక్ష్యం. ఓయూకు అవార్డులు రావడంపై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు.
(4 / 6)
గుత్తికోయ ట్రైబల్ పిల్లలకు విద్యను అందించడానికి, వారికి బయటి ప్రపంచానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ప్రతిరోజూ ఐదు నుంచి ఏడు కిలోమీటర్లు ప్రయాణించి అంకితభావంతో విద్యను అందిస్తున్న వాలంటీర్లపై ఓయూ ఈఏంఆర్సీ డాక్యుమెంటరీ తీసింది.
(5 / 6)
అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఓయూ ఈఏంఆర్సీ తన మొట్టమొదటి అవార్డును గెలుచుకుంది. త్వరలో జరిగే ఇంటర్నేషనల్ నేచర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పి.రఘుపతిని సత్కరించనున్నారు.
ఇతర గ్యాలరీలు