Oscars 2024: బెస్ట్ యాక్టర్‌గా సిలియన్ మర్ఫీకి ఆస్కార్.. రెడ్ కార్పెట్‌పై మెరిసిన స్టార్స్-oscars 2024 best actor cillian murphy to robert downey jr zendaya on red carpet 96th academy awards ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Oscars 2024 Best Actor Cillian Murphy To Robert Downey Jr Zendaya On Red Carpet 96th Academy Awards

Oscars 2024: బెస్ట్ యాక్టర్‌గా సిలియన్ మర్ఫీకి ఆస్కార్.. రెడ్ కార్పెట్‌పై మెరిసిన స్టార్స్

Mar 11, 2024, 10:45 AM IST Sanjiv Kumar
Mar 11, 2024, 10:45 AM , IST

96th Academy Awards: 96వ అకాడమీ అవార్డ్స్‌లో స్టార్‌లు రెడ్ కార్పెట్‌పై తమ బెస్ట్ లుక్‌లో కనిపించారు. బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలో ఆస్కార్ అందుకున్న సిలియన్ మర్ఫీతోపాటు రాబర్ట్ డౌనీ జూనియర్ నుంచి జెండయా వరకు తమ లుక్స్‌తో ఆకట్టుకున్నారు.

హాలీవుడ్‌లో జరిగిన 96వ అకాడమీ అవార్డుల కోసం డాల్బీ థియేటర్‌కి తారలు వచ్చారు. ఆస్కార్స్ 2024 రెడ్ కార్పెట్‌పై తారలు అందంగా పోజులు ఇచ్చారు. జెండయా, ఆస్కార్ విజేత రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమ్మా స్టోన్, ఎమిలీ బ్లంట్, ర్యాన్ గోస్లింగ్, ఫ్లోరెన్స్ పగ్, అమెరికా ఫెర్రెరా, బెస్ట్ సాంగ్ నామినీ బిల్లీ ఎలిష్, అన్యా టేలర్-జాయ్ తదితరులు రెడ్ కార్పెట్‌పై అదిరే లుక్స్ తో ఆకట్టుకున్నారు. 

(1 / 11)

హాలీవుడ్‌లో జరిగిన 96వ అకాడమీ అవార్డుల కోసం డాల్బీ థియేటర్‌కి తారలు వచ్చారు. ఆస్కార్స్ 2024 రెడ్ కార్పెట్‌పై తారలు అందంగా పోజులు ఇచ్చారు. జెండయా, ఆస్కార్ విజేత రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమ్మా స్టోన్, ఎమిలీ బ్లంట్, ర్యాన్ గోస్లింగ్, ఫ్లోరెన్స్ పగ్, అమెరికా ఫెర్రెరా, బెస్ట్ సాంగ్ నామినీ బిల్లీ ఎలిష్, అన్యా టేలర్-జాయ్ తదితరులు రెడ్ కార్పెట్‌పై అదిరే లుక్స్ తో ఆకట్టుకున్నారు. (Reuters, AP, Instagram)

జెండయా నిస్సందేహంగా ఆస్కార్ రాత్రికి అదిరిపోయే లుక్ లో దర్శనం ఇచ్చింది. మావ్ పింక్ వన్-షోల్డర్ గౌను సిల్వర్ సీక్విన్‌తో అలంకరించబడిన కార్సెట్, సీక్విన్ పామ్-ప్యాటర్న్ లో అందంగా కనిపించింది. 

(2 / 11)

జెండయా నిస్సందేహంగా ఆస్కార్ రాత్రికి అదిరిపోయే లుక్ లో దర్శనం ఇచ్చింది. మావ్ పింక్ వన్-షోల్డర్ గౌను సిల్వర్ సీక్విన్‌తో అలంకరించబడిన కార్సెట్, సీక్విన్ పామ్-ప్యాటర్న్ లో అందంగా కనిపించింది. (Reuters)

పూర్ థింగ్స్‌ సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా ఎంపికైన ఎమ్మా స్టోన్ ఆస్కార్ కార్పెట్ పై సిల్వర్ కలర్ డ్రెస్సులో దర్శనం ఇచ్చింది. 

(3 / 11)

పూర్ థింగ్స్‌ సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా ఎంపికైన ఎమ్మా స్టోన్ ఆస్కార్ కార్పెట్ పై సిల్వర్ కలర్ డ్రెస్సులో దర్శనం ఇచ్చింది. (REUTERS)

సిలియన్ మర్ఫీ, వైవోన్నే మెక్‌గిన్నిస్ ఆస్కార్ 2024 రెడ్ కార్పెట్ వద్దకు చేతిలో చేయి వేసుకుని వచ్చారు. ఒపెన్‌హైమర్‌లో తన పాత్రకు ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ అందుకున్నాడు సిలియన్ మర్ఫీ. రెడ్ కార్పెట్ పై నలుపు రంగు టక్సేడో డ్రెస్ ధరించాడు ఈ ఆస్కార్ విన్నర్. 

(4 / 11)

సిలియన్ మర్ఫీ, వైవోన్నే మెక్‌గిన్నిస్ ఆస్కార్ 2024 రెడ్ కార్పెట్ వద్దకు చేతిలో చేయి వేసుకుని వచ్చారు. ఒపెన్‌హైమర్‌లో తన పాత్రకు ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ అందుకున్నాడు సిలియన్ మర్ఫీ. రెడ్ కార్పెట్ పై నలుపు రంగు టక్సేడో డ్రెస్ ధరించాడు ఈ ఆస్కార్ విన్నర్. (REUTERS)

ఎమిలీ బ్లంట్ తన భర్త జాన్ క్రాసిన్‌స్కీతో కలిసి ఆస్కార్‌ వేడుకకు వచ్చారు. ఒపెన్‌హైమర్ కోసం ఉత్తమ సహాయ నటి కేటగిరీకి నామినేట్ చేయబడింది ఎమిలీ బ్లంట్, ఎమిలీ కస్టమ్ స్కియాపరెల్లి గౌను ధరించింది. పెర్ల్-వైట్ సీక్విన్స్, వెండి పూసలు, లేయర్డ్ డైమండ్ నెక్లెస్‌తో మెరిసిపోయింది. 

(5 / 11)

ఎమిలీ బ్లంట్ తన భర్త జాన్ క్రాసిన్‌స్కీతో కలిసి ఆస్కార్‌ వేడుకకు వచ్చారు. ఒపెన్‌హైమర్ కోసం ఉత్తమ సహాయ నటి కేటగిరీకి నామినేట్ చేయబడింది ఎమిలీ బ్లంట్, ఎమిలీ కస్టమ్ స్కియాపరెల్లి గౌను ధరించింది. పెర్ల్-వైట్ సీక్విన్స్, వెండి పూసలు, లేయర్డ్ డైమండ్ నెక్లెస్‌తో మెరిసిపోయింది. (REUTERS)

బార్బీ సినిమాలో తన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా నామినేట్ అయిన ర్యాన్ గోస్లింగ్ సిల్వర్ సీక్విన్స్‌తో కూడిన కస్టమ్ గూచీ సూట్‌లో వచ్చారు. అతను సొగసైన చైన్ తో అట్రాక్ట్ చేశాడు. 

(6 / 11)

బార్బీ సినిమాలో తన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా నామినేట్ అయిన ర్యాన్ గోస్లింగ్ సిల్వర్ సీక్విన్స్‌తో కూడిన కస్టమ్ గూచీ సూట్‌లో వచ్చారు. అతను సొగసైన చైన్ తో అట్రాక్ట్ చేశాడు. (REUTERS)

క్రిస్ హేమ్స్‌వర్త్, ఎల్సా పటాకీ, సుసాన్ డౌనీ అండ్  రాబర్ట్ డౌనీ జూనియర్ కలిసి ఆస్కార్స్ 2024 రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చారు. ఓపెన్‌హైమర్‌కు ఉత్తమ సహాయ నటుడి అవార్డును గెలుచుకున్న రాబర్ట్‌తోపాటు క్రిస్ ఆస్కార్ రెడ్ కార్పెట్ పై బ్లాక్ టైలర్డ్ సూట్‌లతో కనిపించారు. 

(7 / 11)

క్రిస్ హేమ్స్‌వర్త్, ఎల్సా పటాకీ, సుసాన్ డౌనీ అండ్  రాబర్ట్ డౌనీ జూనియర్ కలిసి ఆస్కార్స్ 2024 రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చారు. ఓపెన్‌హైమర్‌కు ఉత్తమ సహాయ నటుడి అవార్డును గెలుచుకున్న రాబర్ట్‌తోపాటు క్రిస్ ఆస్కార్ రెడ్ కార్పెట్ పై బ్లాక్ టైలర్డ్ సూట్‌లతో కనిపించారు. (Jordan Strauss/Invision/AP)

డూన్ మూవీ స్టార్ ఫ్లోరెన్స్ పగ్ మెరిసే బల్గారీ ఆభరణాలతో జత చేసిన డెల్ కోర్ గౌనులో ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై వయ్యారాలు పోయింది. సిల్వర్ డ్రెస్సులో నీటి బిందువుల పూసలతో అలంకరించబడిన షీర్ కార్సెట్, కార్సెటెడ్ బాడీస్, పెప్లం, నెక్‌లైన్, ఫ్లోర్ స్వీపింగ్ శాటిన్ స్కర్ట్ వేసుకుని అందంగా కనిపించింది. 

(8 / 11)

డూన్ మూవీ స్టార్ ఫ్లోరెన్స్ పగ్ మెరిసే బల్గారీ ఆభరణాలతో జత చేసిన డెల్ కోర్ గౌనులో ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై వయ్యారాలు పోయింది. సిల్వర్ డ్రెస్సులో నీటి బిందువుల పూసలతో అలంకరించబడిన షీర్ కార్సెట్, కార్సెటెడ్ బాడీస్, పెప్లం, నెక్‌లైన్, ఫ్లోర్ స్వీపింగ్ శాటిన్ స్కర్ట్ వేసుకుని అందంగా కనిపించింది. (REUTERS)

అరియానా గ్రాండే ఆస్కార్స్ 2024కి పింక్ కలర్ భారీ గౌనులో హాజరయ్యారు, అది వికెడ్ చిత్రంలో మంచి మంత్రగత్తెగా ఆమె రాబోయే పాత్ర తరహాలో ఉంది. కస్టమ్ గియాంబట్టిస్టా వల్లీ హాట్ కోచర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో డిఫరెంట్ గా అరియానా కనువిందు చేసింది. 

(9 / 11)

అరియానా గ్రాండే ఆస్కార్స్ 2024కి పింక్ కలర్ భారీ గౌనులో హాజరయ్యారు, అది వికెడ్ చిత్రంలో మంచి మంత్రగత్తెగా ఆమె రాబోయే పాత్ర తరహాలో ఉంది. కస్టమ్ గియాంబట్టిస్టా వల్లీ హాట్ కోచర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో డిఫరెంట్ గా అరియానా కనువిందు చేసింది. (John Locher/Invision/AP)

అమెరికా ఫెర్రెరా, ర్యాన్ పియర్స్ విలియమ్స్ ఆస్కార్స్ 2024లో రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చారు. ఈ సందర్భంగా ఆమె పింక్ సీక్విన్డ్ వెర్సాస్ గౌను ధరించింది. 

(10 / 11)

అమెరికా ఫెర్రెరా, ర్యాన్ పియర్స్ విలియమ్స్ ఆస్కార్స్ 2024లో రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చారు. ఈ సందర్భంగా ఆమె పింక్ సీక్విన్డ్ వెర్సాస్ గౌను ధరించింది. (REUTERS)

కారీ ముల్లిగాన్ 2024 ఆస్కార్ రెడ్ కార్పెట్‌ను అద్భుతమైన బ్లాక్ మెర్మైడ్ డ్రెస్‌లో తెల్లటి టల్లేపై స్కాలోప్డ్ హెమ్‌తో అలంకరించారు. ఆమె 1951 కాలం నాటి  క్లాసిక్ బాలెన్సియాగా డిజైన్‌ తో కనువిందు చేసింది. 

(11 / 11)

కారీ ముల్లిగాన్ 2024 ఆస్కార్ రెడ్ కార్పెట్‌ను అద్భుతమైన బ్లాక్ మెర్మైడ్ డ్రెస్‌లో తెల్లటి టల్లేపై స్కాలోప్డ్ హెమ్‌తో అలంకరించారు. ఆమె 1951 కాలం నాటి  క్లాసిక్ బాలెన్సియాగా డిజైన్‌ తో కనువిందు చేసింది. (REUTERS)

ఇతర గ్యాలరీలు